Breaking News

టీమిండియా కెప్టెన్‌గా రిషబ్ పంత్‌.. సిక్స‌ర్ల కింగ్‌లు ఎంట్రీ!?

Published on Fri, 04/19/2024 - 17:17

ఈ ఏడాది జూన్‌లో అమెరికా, వెస్టిండీస్‌ల వేదిక‌గా జ‌ర‌గ‌నున్న‌ టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2024 అనంత‌రం భార‌త జ‌ట్టు జింబాబ్వే ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నుంది. ఈ టూర్‌లో భాగంగా టీమిండియా ఆతిథ్య‌ జింబాబ్వేతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో త‌ల‌ప‌డ‌నుంది. ఈ సిరీస్‌ జూలై 6న ప్రారంభ‌మై అదే నెల 14న ముగియ‌నుంది.

ఈ సిరీస్‌లో అన్ని మ్యాచ్‌లు  హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదిక‌గానే జ‌ర‌గ‌నున్నాయి. అయితే ఈ జింబాబ్వే పర్యటనకు భారత తృతీయ ‍శ్రేణి జట్టును బీసీసీఐ పంపించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. టీ20 వరల్డ్‌కప్‌లో భాగమయ్యే ఒకరిద్దరూ మినహా మిగతా భారత ఆటగాళ్లందరికి ఈ సిరీస్‌కు విశ్రాంతి ఇవ్వనున్నట్లు సమాచారం.

అంతేకాకుండా గాయం నుంచి కోలుకుని రీ ఎంట్రీలో అదరగొడుతున్న వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్‌కు ఈ సిరీస్‌లో భారత జట్టు పగ్గాలు అప్పగించాలని అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ యోచిస్తుందంట.

కాగా పంత్ సూప‌ర్ ఫామ్‌లో ఉన్నాడు. పున‌రాగ‌మ‌నంలో కెప్టెన్‌గానే కాకుండా వ్య‌క్తిగ‌త ప్ర‌ద‌ర్శ‌న ప‌రంగా కూడా స‌త్తాచాటుతున్నాడు. ఇప్ప‌టివ‌ర‌కు 7 మ్యాచ్‌లు ఆడిన పంత్ 210 ప‌రుగులు చేశాడు. మ‌రోవైపు ఐపీఎల్‌-2024లో దుమ్ములేపుతున్న రియాన్ ప‌రాగ్‌, శ‌శాంక్ సింగ్‌, అశుతోష్ శ‌ర్మ‌, సాయిసుద‌ర్శ‌న్, అభిషేక్ శ‌ర్మ‌ వంటి యువ ఆట‌గాళ్ల‌ను ఈ సిరీస్‌కు ఎంపిక చేయ‌నున్న‌ట్లు ప‌లు రిపోర్టులు పేర్కొంటున్నాయి.

వీరితో పాటు రుతురాజ్ గైక్వాడ్‌, సంజూ శాంస‌న్‌, శివ‌మ్ దూబే, అర్ష్‌దీప్‌ సింగ్‌, ముఖేష్‌ కుమార్‌ వంటి స్టార్‌ ఆట‌గాళ్లను సైతం  జింబాబ్వే టూర్‌కు పంపించనున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. 
 

Videos

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)