Breaking News

IPL 2025: రిషబ్‌ పంత్‌కు ఊహించని ఎదురు దెబ్బ.. !?

Published on Sat, 07/20/2024 - 13:32

ఐపీఎల్‌-2025 సీజన్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ భారీ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే హెడ్‌కోచ్ రికీ పాంటింగ్‌పై వేటు వేసిన ఢిల్లీ క్యాపిటల్స్‌.. ఇప్పుడు కెప్టెన్ రిషబ్ పంత్‌ను కూడా విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

దైనిక్ జాగరణ్ నివేదిక ప్రకారం..  ఐపీఎల్‌-2025 మెగా వేలానికి ముందు పంత్‌ను రిటైన్ చేసుకోడదని ఢిల్లీ భావిస్తున్నట్లు సమాచారం. పంత్‌కు ఢిల్లీ క్రికెట్ డైరెక్టర్ సౌరవ్ గంగూలీ మద్దతు ఉన్నప్పటికీ.. ఫ్రాంచైజీ యాజమాన్యం మాత్రం అతడిని విడిచి పెట్టే అవకాశముందని దైనిక్ జాగరణ్ తమ రిపోర్ట్‌లు పేర్కొంది.

అదేవిధంగా పంత్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ తమ జట్టు నుంచి విడుదల చేస్తే.. అతడిని దక్కించుకునేందుకు చెన్నై సూపర్ కింగ్స్ పోటీ పడే అవకాశముందని సదరు పత్రిక పేర్కొంది.

సీఎస్‌కే వికెట్ కీపర్ బ్యాటర్‌ ఎంఎస్ ధోని వచ్చే ఏడాది సీజన్‌లో ఆడుతాడాలేదన్నది ఇంకా క్లారిటీ లేదు. ఈ క్రమంలోనే ఇండియన్ వికెట్ కీపర్ బ్యాటర్ కావాలని సీఎస్‌కే ఆసక్తిగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 

అయితే పంత్ కెప్టెన్సీపై కూడా ఢిల్లీ ఫ్రాంచైజీ ఆసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. గతేడాది సీజన్‌కు రోడ్డు ప్రమాదం కారణంగా దూరంగా ఉన్న రిషబ్. . ఈ ఏడాది సీజన్‌తో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చాడు.

అయితే పంత్ తన ఆటతీరుతో ఆకట్టుకున్నప్పటకి.. జట్టును ప్లే ఆఫ్స్‌కు చేర్చ‌డంలో విఫ‌ల‌మ‌య్యాడు. ఈ క్ర‌మంలోనే అత‌డిని విడిచిపెట్టాల‌ని ఢిల్లీ నిర్ణ‌యించుకున్న‌ట్లు క్రికెట్ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. కాగా రిషబ్‌.. ఐపీఎల్‌లో ఢిల్లీ తరపున లీడింగ్‌ రన్‌ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు.

Videos

ఎవడికి చెప్పుకుంటావో చెప్పుకో.. పోలీస్ స్టేషన్ లో బాధితుడి గొంతు పట్టుకున్న ఎస్ఐ

ప్రభాకర్ తో మొదలైన ప్రకంపనలు.. ఇకనైనా బాబు, లోకేష్ నోరువిప్పుతారా ?

హైవేపై ఆయిల్ కాలువలు.. బిందెలతో ఎగబడ్డ జనం

ప్రకాశం జిల్లాలో లాకప్ డెత్..?

టీచర్ జాబ్స్ లో ట్విస్ట్.. లోకేష్ కు బిగ్ షాక్..!

ఎన్టీఆర్ కోసం క్యూ కడుతున్న బాలీవుడ్ స్టార్స్...

కడప జిల్లాలో పదో తరగతి అర్హతతో ఒక యువతికి టీచర్ పోస్టు..!

దగా DSCలో బడి దొంగల మొత్తం లిస్ట్ బయట పెట్టిన శేఖర్ రెడ్డి

ఎట్టకేలకు పట్టుకున్నారు

ఉత్తరాదిలో దంచికొడుతున్న వర్షాలు..

Photos

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు