Breaking News

రిష‌బ్ పంత్ వ‌ర‌ల్డ్ రికార్డు..

Published on Sat, 06/21/2025 - 16:46

లీడ్స్ వేదిక‌గా ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న తొలి టెస్టులో భార‌త వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ రిష‌బ్ పంత్ అద్బుత‌మైన సెంచ‌రీ సాధించాడు. ఐదో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన పంత్‌.. వన్డే తరహాలో తన ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు.

ఈ క్రమంలో పంత్‌ 146 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్‌ల సాయంతో తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. పంత్‌కు ఇది ఏడో టెస్టు సెంచరీ కావడం విశేషం​. రిషబ్ సెంచరీ సాధించగానే సంతోషంతో మరోసారి ఫ్లిప్‌ జంప్ చేశాడు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో భారత్ భారీ స్కోర్ దిశగా సాగుతోంది.

106 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా ఐదు వికెట్ల నష్టానికి 451 పరుగులు చేసింది. క్రీజులో రిషబ్‌(113)తో పాటు కెప్టెన్ రవీంద్ర జడేజా(1) ఉన్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన రిషబ్ పంత్ పలు అరుదైన రి​కార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. 

చ‌రిత్ర సృష్టించిన రిషబ్ పంత్‌..
👉టెస్టు క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన భారత వికెట్ కీపర్ బ్యాటర్‌గా పంత్ చరిత్ర సృష్టించాడు. పంత్ ఇప్పటివరకు టెస్టుల్లో 7 సెంచరీలు సాధించాడు. ఇప్పటివరకు ఈ రికార్డు టీమిండియా లెజెండ్ ఎంఎస్‌ధోని పేరిట ఉండేది. ధోని తన కెరీర్‌లో 6 టెస్టు సెంచరీలు సాధించాడు. తాజా శతకంతో ధోనిని పంత్ అధిగమించాడు.

👉సేనా (దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో అత్య‌ధిక టెస్టు ర‌న్స్‌ చేసిన ప‌ర్యాట‌క జ‌ట్టు వికెట్ కీప‌ర్‌గా పంత్ నిలిచాడు. పంత్ ఇప్ప‌టివ‌ర‌కు సేనా దేశాల్లో 49 ఇన్నింగ్స్‌ల‌లో 1746  ప‌రుగులు చేశాడు. ఇంతకుముందు ఈ వ‌ర‌ల్డ్ రికార్డు కూడా ఎంఎస్ ధోని పేరిటే ఉండేది. ధోని త‌న కెరీర్‌లో సేనా దేశాల్లో 60 ఇన్నింగ్స్‌లు ఆడి 1731 ప‌రుగులు చేశాడు. తాజా మ్యాచ్‌తో ధోని వ‌ర‌ల్డ్ రికార్డును పంత్ బ్రేక్ చేశాడు.

👉విదేశీ గ‌డ్డ‌పై అత్య‌ధిక టెస్టు సెంచ‌రీలు చేసిన మూడో వికెట్ కీప‌ర్‌గా ఇంగ్లండ్‌కు చెందిన లెస్ అమెస్ రికార్డును పంత్ స‌మం చేశాడు. అమీస్‌ విదేశాల్లో ఐదు టెస్టు సెంచ‌రీలు చేయ‌గా.. పంత్ కూడా స‌రిగ్గా ఐదు సెంచ‌రీలు చేశాడు.  ఈ ప‌ర్య‌ట‌న‌లో మ‌రో సెంచ‌రీ చేస్తే అమీస్‌ను అధిగ‌మిస్తున్నాడు. ఈ జాబితాలో ఆసీస్ లెజెండ‌రీ వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ ఆడ‌మ్ గిల్‌క్రిస్ట్‌(10) అగ్ర‌స్ధానంలో ఉన్నాడు.

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు