DC Vs LSG: ఐపీఎల్ హిస్ట‌రీలోనే కాస్ట్‌లీ ప్లేయ‌ర్‌.. క‌ట్ చేస్తే! తొలి మ్యాచ్‌లోనే డ‌కౌట్‌

Published on Mon, 03/24/2025 - 22:46

ఐపీఎల్‌-2025ను ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ కెప్టెన్ రిష‌బ్ పంత్ పేల‌వంగా ఆరంభించాడు. ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే అత్య‌ధిక ఖ‌రీదైన ఆట‌గాడిగా నిలిచిన రిష‌బ్ పంత్‌.. తొలి మ్యాచ్‌లోనే తీవ్ర నిరాశ‌ప‌రిచాడు. ఈ మెగా టోర్నీలో భాగంగా వైజాగ్ వేదిక‌గా ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో మ్యాచ్‌లో పంత్‌ డ‌కౌట‌య్యాడు. నాలుగో స్ధానంలో బ్యాటింగ్‌కు వ‌చ్చిన పంత్‌.. ఆరు బంతులు ఎదుర్కొని ఖాతా తెర‌వ‌కుండానే పెవిలియ‌న్‌కు చేరాడు.

కుల్దీప్ యాద‌వ్ బౌలింగ్‌లో ఫాఫ్ డుప్లెసిస్‌కు క్యాచ్ ఇచ్చి ఔట‌య్యాడు. దీంతో పంత్‌ను నెటిజ‌న్లు ట్రోలు చేస్తున్నారు. ఈ మాత్రం ఆట‌కేనా రూ. 27 కోట్లు అంటూ పోస్ట్‌లు పెడుతున్నారు. కాగా గ‌తేడాది జ‌రిగిన మెగా వేలంలో రూ. 27 కోట్ల భారీ ధ‌ర‌కు పంత్‌ను ల‌క్నో కొనుగోలు చేసింది. ఇక ఈ మ్యాచ్‌లో పంత్ విఫ‌ల‌మైన‌ప్ప‌టికి మిగితా బ్యాట‌ర్లు మాత్రం విధ్వంసం సృష్టించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ల‌క్నో నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 209 ప‌రుగులు చేసింది. 

ల‌క్నో బ్యాట‌ర్ల‌లో మిచెల్ మార్ష్‌( 36 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌ల‌తో 72), నికోల‌స్ పూర‌న్‌( 30 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్స్‌ల‌తో 75 ప‌రుగులు) హాఫ్ సెంచ‌రీల‌తో చెలరేగారు. ఓ దశలో ఈజీగా 250 పైగా లక్నో స్కోర్ దాటుతుందని భావించారు. కానీ 15 ఓవర్ల తర్వాత ఢిల్లీ బౌలర్లు కమ్‌బ్యాక్ ఇచ్చారు. ఢిల్లీ బౌల‌ర్ల‌లో మిచెల్ స్టార్క్ మూడు వికెట్లు, కుల్దీప్ యాద‌వ్ రెండు వికెట్లు సాధించ‌గా.. విప్రాజ్ నిగ‌మ్‌, ముఖేష్ కుమార్ త‌లా వికెట్ సాధించారు.
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)