చరిత్ర సృష్టించిన పంత్‌.. ఎంఎస్‌ ధోని రికార్డు సమం

Published on Sat, 09/21/2024 - 17:32

టీమిండియా కీప‌ర్ రిష‌బ్ పంత్ త‌న టెస్టు క్రికెట్ రీఎంట్రీని ఘ‌నంగా చాటుకున్నాడు. చెపాక్ వేదిక‌గా బంగ్లాదేశ్‌తో జ‌రుగుతున్న తొలి టెస్టులో పంత్ అద్భుత‌మైన శ‌త‌కంతో మెరిశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 39 ప‌రుగుల‌తో రాణించిన పంత్‌.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం సూప‌ర్ సెంచ‌రీతో చెల‌రేగాడు. 

టీ20 క్రికెట్‌ను త‌ల‌పిస్తూ బంగ్లా బౌల‌ర్ల‌ను ఊతికారేశాడు. యువ ఆట‌గాడు శుబ్‌మ‌న్ గిల్‌తో క‌లిసి భారత స్కోర్ బోర్డును ప‌రుగులు పెట్టించాడు. సెకెండ్ ఇన్నింగ్స్‌లో 128 బంతులు ఎదుర్కొన్న రిషబ్‌.. 13 ఫోర్లు, 4 సిక్స్‌ల‌తో 109 ప‌రుగులు చేశాడు. పంత్‌కు ఇది ఆరువ టెస్టు సెంచ‌రీ కావ‌డం గ‌మ‌నార్హం. ఈ క్ర‌మంలో పంత్ ఓ అరుదైన రికార్డును త‌న పేరిట లిఖించుకున్నాడు.

ఎంఎస్ ధోని రికార్డు స‌మం..
టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు సెంచ‌రీలు చేసిన‌ భార‌త వికెట్ కీప‌ర్‌గా లెజెండరీ ఆట‌గాడు ఎంఎస్ ధోని రికార్డును పంత్ స‌మం చేశాడు. ధోనీ 90 టెస్టుల్లో ఈ మైలురాయిని చేరుకోగా, పంత్ కేవలం 34 మ్యాచ్‌ల్లోనే ఈ రికార్డును అందుకున్నాడు. 

మ‌రో సెంచ‌రీ చేస్తే ధోనిని పంత్ అధిగ‌మిస్తాడు. ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. బంగ్లాదేశ్ ముందు భార‌త్ 515 పరుగుల భారీ లక్ష్యం నిర్దేశించింది.  మూడో రోజు ఆట ముగిసే సరికి బంగ్లా.. 37.2 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది.  ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ విజయం సాధించాలంటే ఇంకో 357 పరుగులు అవసరం.

చదవండి: 53 ఏళ్ల వన్డే క్రికెట్‌ చరిత్రలో ఇదే తొలిసారి!

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)