Breaking News

లార్డ్స్ టెస్టులో టీమిండియాకు గుడ్ న్యూస్‌..

Published on Fri, 07/11/2025 - 22:01

లార్డ్స్ వేదిక‌గా ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న మూడో టెస్టులో టీమిండియాకు గుడ్ న్యూస్ అందింది. చేతి వేలి గాయం కార‌ణంగా ఫీల్డింగ్‌కు దూర‌మైన వికెట్ కీప‌ర్ రిష‌బ్ పంత్‌.. తిరిగి బ్యాటింగ్‌కు రానున్నాడు. ఐదో స్ధానంలో బ్యాటింగ్‌కు వ‌చ్చేందుకు పంత్ ప్యాడ్స్ క‌ట్టుకుని సిద్దంగా ఉన్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతున్నాయి.

కాగా తొలి రోజు ఆట సంద‌ర్భంగా బుమ్రా బౌలింగ్‌లో పంత్ చూపుడు వేలికి గాయ‌మైంది. దీంతో ఆట మ‌ధ్య‌లోనే మైదానం నుంచి బ‌య‌ట‌కు వెళ్లిపోయాడు. రెండో రోజు ఆట‌లో కూడా పంత్ ఫీల్డింగ్ రాలేదు. అత‌డి స్దానంలో ధ్రువ్ జురెల్ వికెట్ కీప‌ర్‌గా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించాడు.

నెట్స్‌లో ప్రాక్టీస్ చేసిన పంత్‌..
అయితే రెండో రోజు ఆట ఆరంభానికి ముందు రిష‌బ్ పంత్‌.. బ్యాటింగ్ కోచ్ సీతాన్షు కోటక్, ఫిజియో యోగేష్ పర్మార్ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ద్దరు త్రోడౌన్ స్పెషలిస్టులతో కలిసి పంత్ నెట్ ప్రాక్టీస్ చేశాడు. ఈ సంద‌ర్బంగా అత‌డు కాస్త ఆసౌక్యర్యంగా క‌న్పించాడు.

ఇంకా అత‌డికి ఇంకా పూర్తిగా చేతి వేలి నొప్పి త‌గ్గ‌న‌ట్లు తెలుస్తోంది. అయిన‌ప్ప‌టికి జ‌ట్టు అవ‌స‌రం దృష్ట్యా అతడు బ్యాటింగ్‌కు రావాలని అతడి నిర్ణయించుకున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. కాగా రిషబ్‌ ప్రస్తుతం అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు. తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లో సెంచ‌రీల మోత మ్రోగించిన పంత్‌.. రెండో టెస్టులో హాఫ్ సెంచ‌రీతో మెరిశాడు.
 

Videos

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)