Breaking News

రింకూ సింగ్‌కు లక్కీ ఛాన్స్‌.. ఆ జట్టు నుంచి పిలుపు?

Published on Mon, 09/09/2024 - 12:02

టీమిండియా విధ్వంస‌క‌ర ఆట‌గాడు రింకూ సింగ్ మ‌ళ్లీ రెడ్ బాల్ క్రికెట్ ఆడేందుకు సిద్ద‌మ‌య్యాడు. దులీప్ ట్రోఫీ-2024లో ఇండియా-బి జ‌ట్టు త‌ర‌పున రింకూ ఆడ‌నున్నాడు. భార‌త‌-బి జ‌ట్టులోని చాలా మంది ఆట‌గాళ్లు బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ ఆడేందుకు వెళ్ల‌నున్నారు.

ప్ర‌స్తుతం బి జ‌ట్టులో భాగంగా ఉన్న య‌శ‌స్వీ జైశ్వాల్‌, రిష‌బ్ పంత్‌, స‌ర్ఫ‌రాజ్ ఖాన్‌, య‌శ్ ద‌యాల్‌ల‌కు బంగ్లాతో టెస్టు సిరీస్‌కు ఎంపికయ్యారు. సెప్టెంబ‌ర్ 12 నుంచి జ‌ర‌గ‌నున్న త‌దుప‌రి రౌండ్ మ్యాచ్‌ల‌కు వీరింద‌రూ అందుబాటులో ఉండ‌రు.

ఈ నేప‌థ్యంలోనే రింకూ సింగ్‌తో పాటు మ‌రో ఉత్తర‌ప్ర‌దేశ్ ఆట‌గాడు ఆకిబ్ ఖాన్‌కు దులీప్ ట్రోఫీలో ఆడేందుకు పిలుపు వ‌చ్చింది అయితే ఈ దేశీవాళీ టోర్నీకి ముందు ఎంపిక చేసిన జ‌ట్ల‌లో రింకూకు చోటు ద‌క్క‌లేదు. దీంతో అతడు యూపీ టీ20లో లీగ్‌లో భాగ‌మ‌య్యాడు. కానీ ఇప్పుడు సెల‌క్ట‌ర్లు నుంచి పిలుపు రావ‌డంతో అత‌డు ఇండియా బి జ‌ట్టుతో చేర‌నున్నాడు.

"దులీప్ ట్రోఫీలో ఆడేందుకు అవకాశం వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. కష్టపడి పనిచేయడమే నా పని. మొద‌ట జ‌ట్ల‌ను ప్రకటించినప్పుడు.. నా పేరు లేక‌పోవ‌డం కాస్త‌ నిరుత్సాహపడ్డాను. కానీ ఇప్ప‌డు మ‌ళ్లీ పిలుపు రావ‌డంతో సంతోషంగా ఉంది" అని టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో రింకూ పేర్కొన్నాడు. అతడు త్వరలోనే అనంతపూర్‌లో ఉన్న భారత జట్టుతో చేరనున్నాడు.
చదవండి: IND vs BAN: అప్పుడు జీరో.. క‌ట్ చేస్తే..! ఇప్పుడు ఏకంగా టీమిండియాలో ఎంట్రీ?
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)