Breaking News

IND Vs PAK: 'లేడీ ధోని' కళ్లు చెదిరే క్యాచ్‌.. పాక్ బ్యాటర్ మైండ్ బ్లాంక్‌( వీడియో)

Published on Sun, 10/06/2024 - 17:22

మ‌హిళ‌ల టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2024లో భాగంగా దుబాయ్ వేదిక‌గా పాకిస్తాన్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో భారత వికెట్ కీప‌ర్ రిచా ఘోష్ సంచ‌ల‌న క్యాచ్‌తో మెరిసింది. కళ్లు చెదిరే క్యాచ్‌తో పాక్ కెప్టెన్ ఫాతిమా సానాను రిచా పెవిలియ్‌న‌కు పంపింది. పాక్ ఇన్నింగ్స్ 14వ ఓవ‌ర్ వేసిన ఆశా శోభన ఐదో బంతిని ఫాతిమాకు లూపీ డెలివ‌రీగా సంధించింది.

అప్ప‌టికే స్వీప్ ఆడి వ‌రుస‌గా రెండు బౌండ‌రీలు బాదిన ఫాతిమా.. ఆ డెలివ‌రీని కూడా స్లాగ్ స్వీప్ ఆడ‌టానికి ప్ర‌య‌త్నించింది. అయితే బంతి ఎడ్జ్ తీసుకుని వైడ్ ఔట్ సైడ్ ఆఫ్ దిశ‌గా వెళ్లింది. ఈ క్ర‌మంలో వికెట్ కీప‌ర్ రిచా త‌న కుడివైపు ప‌క్షిలా డైవ్ చేస్తూ ఒంటిచేత్తో స్ట‌న్నింగ్ క్యాచ్ అందుకుంది. 

దీంతో పాక్ కెప్టెన్ మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్లు శెభాష్ రిచా అని కామెంట్లు చేస్తున్నారు. కాగా రిచాను అభిమానులు ముద్దుగా లేడి ధోని అని పిలుచుకుంటున్నారు. 

ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి పాక్‌ 105 పరుగులు చేసింది. భారత బౌలర్లలో పేసర్‌ అరుంధతి రెడ్డి మూడు వికెట్లు పడగొట్టగా.. శ్రేయాంక పాటిల్‌ రెండు, రేణుకా, దీప్తి శర్మ, ఆశా తలా వికెట్‌ సాధించారు. పాక్‌ బ్యాటర్లలో నిధా ధార్‌(28) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచింది.
చదవండి: సురేష్ రైనా సిక్సర్ల వర్షం.. దద్దరిల్లిన మైదానం(వీడియో)
 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)