Breaking News

BCCI: బీసీసీఐ ఏసీయూ చీఫ్‌గా NIA మాజీ హెడ్‌

Published on Sat, 10/05/2024 - 10:25

BCCI ACU New Chief: భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి చెందిన అవినీతి నిరోధక విభాగానికి (ఏసీయూ) అధిపతిగా ప్రముఖ రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి శరద్‌ కుమార్‌ నియమితులయ్యారు. గతంలో ఆయన టెర్రరిజం కార్యకలాపాల్ని నిరోధించేందుకు భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన.. నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) డైరెక్టర్‌ జనరల్‌గా నాలుగేళ్ల పాటు క్లిష్టమైన టెర్రిరిజం దర్యాప్తులను చేపట్టారు.

ఎన్‌ఐఏ హెడ్‌గా పనిచేసిన అనుభవం
ఉత్తరప్రదేశ్‌కు చెందిన 68 ఏళ్ల శరద్‌ 1979 బ్యాచ్‌కు చెందిన హరియాణా క్యాడర్‌ ఐపీఎస్‌. ముంబై ఉగ్రదాడి అనంతరం కేంద్రం ఎన్‌ఐఏను ఏర్పాటు చేసింది. 2013 నుంచి 2017 వరకు శరద్‌ ఎన్‌ఐఏ హెడ్‌గా వ్యవహరించారు. అనంతరం 2018 నుంచి 2020 వరకు సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషనర్‌గా విధులు నిర్వర్తించారు. ఈ సమయంలోనే మ్యాచ్‌ ఫిక్సింగ్‌ కేసులో కీలకంగా పనిచేశారు.

కేకే మిశ్రా ఏడాది పాటే
ఇప్పుడు ఆ అనుభవమే శరద్‌ కుమార్‌ను ఏసీయూ చీఫ్‌ను చేసింది. నిజాయితీ గల అధికారిగా పేరున్న శరద్‌ 1996లో, తిరిగి 2004లో రాష్ట్రపతి పోలీస్‌ మెడల్స్‌ను పొందారు. ఈ నెల 1 నుంచి బోర్డు ఏసీయూ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన ఆయన ఈ పదవిలో మూడేళ్లపాటు పనిచేస్తారని బోర్డు వర్గాలు తెలిపాయి. ఇంతకుముందు ఏసీయూ చీఫ్‌గా ఉన్న కేకే మిశ్రా కూడా హరియాణా క్యాడర్‌కే చెందిన ఐపీఎస్‌ అధికారి. కానీ ఏడాది మాత్రమే పదవిలో ఉన్న ఆయన రాజీనామా చేశారు. దీనికి సంబంధించిన కారణాలు మాత్రం వెల్లడి కాలేదు.   

చదవండి: WT20 WC Ind vs NZ: కివీస్‌ ముందు తలవంచారు

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)