Breaking News

ఆండ్రూ ఫ్లింటాప్‌ కాదు.. ఇంగ్లండ్‌ హెడ్‌ కోచ్‌గా శ్రీలంక లెజెండ్‌!?

Published on Tue, 07/30/2024 - 14:49

ఇంగ్లండ్ ప‌రిమిత ఓవ‌ర్ల హెడ్ కోచ్  మాథ్యూ మోట్‌పై వేటు వేసేందుకు ఆ దేశ క్రికెట్ బోర్డు సిద్ద‌మైంది. వ‌న్డే వ‌ర‌ల్డ్‌క‌ప్-2023, టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2024లో ఇంగ్లండ్ జ‌ట్టు నిరాశ‌ప‌రిచిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే  మాథ్యూ మోట్‌ను హెడ్‌కోచ్ ప‌ద‌వి నుంచి త‌ప్పించాల‌ని ఈసీబీ నిర్ణ‌యించుకున్న‌ట్లు స‌మాచారం.

అత‌డి స్ధానంలో శ్రీలంక క్రికెట్ దిగ్గ‌జం కుమార్ సంగక్క‌ర‌ను త‌మ జ‌ట్టు హెడ్‌కోచ్‌గా నియ‌మించాల‌ని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు భావిస్తున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టికే అత‌డితో ఈసీబీ చ‌ర్చ‌లు కూడా జ‌రిపిన‌ట్లు వినికిడి.  కుమార్ సంగక్కర ప్ర‌స్తుతం ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ క్రికెట్ డైరెక్టర్‌గా ఉన్నాడు. 

అయితే ఆ ప‌ద‌విని భార‌త మాజీ హెడ్‌కోచ్ రాహుల్ ద్ర‌విడ్ చేప‌ట్ట‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే ఇంగ్లండ్ జ‌ట్టు హెడ్‌కోచ్‌గా సంగక్కర వెళ్ల‌నున్న‌ట్లు ప‌లు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. తొలుత ఇంగ్లండ్ ప‌రిమిత ఓవ‌ర్ల హెడ్ కోచ్‌గా ఆ దేశ క్రికెట్ దిగ్గ‌జం ఆండ్రూ ఫ్లింటాప్ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నాడ‌ని వార్త‌లు వినిపించాయి.

కానీ ఫ్లింటాప్ మాత్రం హెడ్‌కోచ్ ప‌ద‌విపై ఆస‌క్తి చూప‌లేదంట‌. ఈ నేప‌థ్యంలోనే ఈసీబీ పెద్ద‌లు చ‌ర్చ‌లు సంగ‌క్క‌ర‌తో జ‌రిపిన‌ట్లు తెలుస్తోంది. ఇక వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌-2023, టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2024 రెండింటిలోనూ ఫైనల్‌కు ఇంగ్లండ్‌ను చేర్చడంలో విఫ‌ల‌మైన‌ప్ప‌ట‌కీ జోస్ బట్లర్‌ను కెప్టెన్‌గా కొనసాగించేందుకు బోర్డు మొగ్గు చూపిన‌ట్లు స‌మాచారం.

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)