Breaking News

'కమిన్స్‌ వస్తే బాగుండు'.. నాలుగో టెస్టుకు కూడా కెప్టెన్‌గా స్మిత్‌

Published on Sun, 03/05/2023 - 14:46

టీమిండియాతో జరిగిన మూడో టెస్టులో 9 వికెట్ల తేడాతో విజయం సాధించిన ఆస్ట్రేలియా ఫుల్‌ జోష్‌లో ఉంది. కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌ వ్యక్తిగత కారణాల రిత్యా స్వదేశానికి వెళ్లిపోవడంతో స్టీవ్‌ స్మిత్‌ స్టాండిన్‌ కెప్టెన్‌గా వ్యవహరించాడు. స్మిత్‌ సారధ్యంలో ఇండోర్‌లో ఆసీస్‌ తన ప్రదర్శనతో అదరగొట్టింది. టీమిండియా బ్యాటర్లను తమ స్పిన్‌ ఉచ్చులో బిగించి ముప్పతిప్పలు పెట్టింది.

ఇక ఒకప్పుడు కెప్టెన్‌గా సక్సెస్‌ అయిన స్మిత్‌ తాజా విజయంతో మరోసారి తన కెప్టెన్సీని నిరూపించుకున్నాడు. అయితే అహ్మదాబాద్‌ వేదికగా జరగనున్న నాలుగో టెస్టుకు కూడా స్మిత్‌ కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం ఉంది. స్వదేశానికి వెళ్లిన పాట్‌ కమిన్స్‌ గురించి ఇంతవరకు ఎలాంటి అప్‌డేట్‌ రాలేదు. ఒకవేళ కమిన్స్‌ తిరిగిరాకపోతే మాత్రం​ మరోసారి స్మిత్‌ జట్టును నడిపించనున్నాడు. అయితే క్రికెట్‌ ఆస్ట్రేలియా ఈ విషయాన్ని అధికారికంగా ద్రువీకరించాల్సి ఉంది. 

''స్వదేశానికి వెళ్లిన కమిన్స్‌ ఇప్పటికే తిరిగి రాలేదు. అతని కుటుంబం ప్రస్తుతం సమస్యలో ఉంది. దానికోసమే అతను వెళ్లాడు. నాలుగో టెస్టు ప్రారంభం అయ్యేలోగా తిరిగి వస్తాడని అనుకుంటున్నాం.'' అంటూ క్రికెట్‌ ఆస్ట్రేలియా ప్రతినిధి మెక్‌డొనాల్డ్‌ పేర్కొన్నాడు.

అయితే మూడో టెస్టు విజయం అనంతరం స్టాండిన్‌ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ''నా టైం అయిపోయింది. మూడో టెస్టు వరకు మాత్రమే నేను జట్టు కెప్టెన్‌ను. ఇప్పడు ఇది పాట్‌ కమిన్స్‌ జట్టు. అతను లేని వారంలో జట్టు క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంది. కానీ మ్యాచ్‌లో మా ప్రదర్శనతో దానిని అధిగమించాం. అతను తిరిగి వస్తాడని అనుకుంటున్నా'' అంటూ తెలిపాడు. 

అహ్మదాబాద్‌ వేదికగా మార్చి 9 నుంచి 13 వరకు జరగనున్న నాలుగో టెస్టుకు సిద్ధమైంది. ఇప్పటికే ఆస్ట్రేలియా మూడోటెస్టు విజయంతో డబ్ల్యూటీసీ ఫైనల్‌ బెర్తు ఖరారు చేసుకుంది. ఈ మ్యాచ్‌ టీమిండియాకు చాలా కీలకం. మ్యాచ్‌ గెలిస్తే ఎలాంటి ఆటంకాలు లేకుండా నేరుగా డబ్ల్యూటీసీ ఫైనల్లో అడుగుపెడుతుంది. ఒకవేళ ఓడినా లేదా డ్రా చేసుకున్నా ఇతర మ్యాచ్‌ ఫలితాలపై ఆధారపడాల్సి ఉంది.

చదవండి: 'చిన్నప్పుడు నువ్వు పెద్ద టార్చ్‌బేరర్‌..'

కంటతడి పెట్టిన సానియా మీర్జా

Videos

సచివాలయ ఉద్యోగులంటే చంద్రబాబుకు ఎందుకింత కక్ష..?

పెళ్లి చూసుకున్నవాళ్లకే దిక్కులేదు... 15 ఏళ్ళు కలిసుంటారట..!

KAAKA నుంచి క్రేజీ అప్డేట్

ఓ బ్రాహ్మణ్ పై కక్ష్య సాధిస్తే... వేమిరెడ్డి దంపతులు ఇది నా ఆక్రందన! శ్రావణ్ శర్మ సతీమణి

సచివాలయం ఉద్యోగులను ఎలా ఈడ్చుకెళ్తున్నారో చూడండి

ఈసీ నియామక విధానంపై జగన్ ప్రశ్నలు.. అసలు వివాదం ఏంటి?

పాత అంబులెన్సుకు కొత్త రంగులు వేసిన ఏపీ సర్కారు

సిగ్గుందా చంద్రబాబు..! ఉద్యోగులంటే బానిసలనుకున్నారా..?

పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. నెలకు అకౌంట్లోకి 20,000

హిమాలయాల్లో పెను సునామీ! 200 కోట్ల మందికి డేంజర్ బెల్స్!

Photos

+5

AP: సచివాలయ ఉద్యోగుల తిరుగుబాటు..!(ఫొటోలు)

+5

ఎర్రచీరలో అందంగా శోభిత చెల్లి సమంత (ఫొటోలు)

+5

'ఆదర్శ కుటుంబం'లోని నారాయణమ్మ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

భర్తతో కలిసి మలేసియా ట్రిప్‌లో హీరోయిన్ అపర్ణ(ఫొటోలు)

+5

'ప్యారడైజ్'లో కేసీఆర్‌ని పోలిన పాత్ర.. షూటింగ్‌లో ఇలా(ఫొటోలు)

+5

బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ వైబ్‌లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి (ఫోటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’లో సంపూర్ణేష్‌ బాబు భార్యగా విషిక.. గ్లామర్‌ ఫొటోలు వైరల్‌

+5

మిజ్వాన్‌ ఫ్యాషన్‌ షోలో అలియా, విక్కీ సందడి(ఫోటోలు)

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)