Breaking News

ఆర్సీబీకి ఊహించని షాక్‌.. స్టార్‌ ప్లేయర్‌ దూరం! ఈ సారి కూడా కష్టమే

Published on Fri, 04/07/2023 - 07:21

ఐపీఎల్‌-2023లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఏడాది సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లకు ఆ జట్టు స్టార్‌ పేసర్‌, ఇంగ్లండ్‌ ఫాస్ట్‌ బౌలర్‌  రీస్ టాప్లీ భుజం గాయం కారణంగా దూరమయ్యాడు.

బెంగళూరు వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ​ఫీల్డింగ్‌ చేస్తుండగా టాప్లీ భుజంకు గాయమైంది. ఈ క్రమంలో అతడు నొప్పితో మైదానంలో విలవిల్లాడు. ఫిజియో వచ్చి చికిత్స అదించనప్పటికీ ఫలితం లేకపోవడంతో అతడు ఫీల్డ్‌ నుంచి బయటకు వెళ్లిపోయాడు.

ఈ క్రమంలో టాప్లే గురువారం కేకేఆర్‌తో మ్యాచ్‌కు కూడా దూరమయ్యాడు. అతడి స్థానంలో డేవిడ్‌ విల్లీ తుది జట్టులోకి వచ్చాడు. ఇక గాయపడిన టాప్లే తన స్వదేశానికి వెళ్లనున్నట్లు ఆర్సీబీ హెడ్‌ కోచ్‌ సంజయ్‌ బంగర్‌ కేకేఆర్‌ మ్యాచ్‌ సందర్భంగా సృష్టం చేశాడు. అతడి స్థానంలో మరో విదేశీ ఆటగాడిని భర్తీ చేయనున్నట్లు బంగర్‌ తెలిపాడు.

"టాప్లే తన స్వదేశానికి వెళ్లనున్నాడు. అతడు మిగిలిన టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. అతడి స్థానంలో మరో ఆటగాడిని రిప్లేస్‌ చేయనున్నాం" అని జియో సినిమాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బంగర్‌ పేర్కొన్నాడు. ఇక ఇప్పటికే ఆర్సీబీ స్టార్‌ ఆటగాళ్లు జోష్‌ హేజిల్‌వుడ్‌, రజత్‌ పాటిదార్‌, విల్‌ జాక్స్‌ గాయం కారణంగా ఐపీఎల్‌-2023కు దూరమయ్యారు. కాగా కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో 81 పరుగుల తేడాతో ఆర్సీబీ ఘోర పరాజయం పాలైంది.
చదవండి: RCB: అర్థం కాని ఆర్‌సీబీ.. ఎప్పుడు ఎలా ఆడుతుందో తెలియదు

Videos

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)