Breaking News

‘ఫిఫా’ అధ్యక్షుడిపై తిరుగుబాటు

Published on Sat, 08/01/2026 - 04:23

జెనీవా: ప్రపంచ ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఫిఫా) అధ్యక్షుడు గియాని ఇన్‌ఫాంటినో చేపట్టిన కొత్త పెట్టుబడి ప్రణాళికపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ‘ఫిఫా’ ప్రపంచకప్‌ లాభాలను ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థలకు విక్రయించాలనే ఇన్‌ఫాంటినో నిర్ణయాన్ని సభ్య దేశాలన్ని తప్పుపడుతున్నాయి. ఇప్పటికే యూరప్, ఉత్తర అమెరికా ఫుట్‌బాల్‌ సమాఖ్యలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించగా... తాజాగా ఆసియా ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఏఎఫ్‌సీ) కూడా ఆ జాబితాలో చేరింది. దీంతో ఇన్‌ఫాంటినోపై ఒత్తిడి మరింత పెరిగింది. ఈ వివాదం ముదురుతున్న తరుణంలో ఇన్‌ఫాంటినోకు అత్యంత సన్నిహితుడు, సీనియర్‌ సలహాదారు కార్లోస్‌ కార్డెరో తన పదవికి రాజీనామా చేశాడు. 

వైట్‌హౌస్‌ వరల్డ్‌కప్‌ టాస్క్‌ ఫోర్స్‌లో ‘ఫిఫా’ ప్రతినిధిగా వ్యవహరించిన కార్డెరో... ఇన్‌ఫాంటినో ప్రతిపాదన ఫుట్‌బాల్‌కు ఏమాత్రం మంచిది కాదని వెల్లడించాడు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అల్లుడు జారెడ్‌ కుష్నర్‌ సోదరుడైన జోషువా కుష్నర్‌ సంస్థ కోసమే ‘ఫిఫా’ ఈ కొత్త ప్రతిపాదనను రూపొందించింది. కాగా... దీనిపై స్పందించిన ఫిఫా ‘ఫుట్‌బాల్‌ను అమ్మేయడానికి ఎవరూ ప్రయత్నించడం లేదు’ అని ప్రకటించిన గంటల వ్యవధిలోనే... కోర్డెరో ‘ప్రపంచకప్‌ లాభాల్లో వాటాలను అమ్మాలని ‘ఫిఫా’ ప్రయత్నిస్తుంటే చూస్తూ ఊరుకోలేను’ అంటూ సంచలన ప్రకటన చేశాడు. ఈ రహస్య ఒప్పందంతో తనకు ఎలాంటి సబంధం లేదని తేల్చిచెప్పాడు. 

ట్రంప్‌ అల్లుడి సోదరుడి కోసం! 
ఇటీవల కెనడా, మెక్సికో, అమెరికా వేదికగా జరిగిన ప్రతిష్టాత్మక వరల్డ్‌కప్‌ విజయవంతం కాగా... దాని ద్వారా వచ్చిన లాభాలతో ట్రంప్‌ సన్నిహితులకు ఆయాచిత లబ్ది చేకూర్చేందుకు ‘ఫిఫా’ అధ్యక్షుడు గియాని ఇన్‌ఫాంటినో ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు తీవ్రమవుతున్నాయి. ‘ఫిఫా’ తన వాణిజ్య వ్యాపారాలను ఒక అనుబంధ సంస్థగా మార్చి అందులో 20 శాతం వాటాను ప్రైవేట్‌ పెట్టుబడిదారులకు విక్రయించాలని భావిస్తోంది. అయితే సరైన సంప్రదింపులు జరపకుండా ఏకపక్షంగా తీసుకున్న ఈ నిర్ణయం ‘ఫిఫా’ పాలనా వైఫల్యాలను ఎత్తిచూపుతోందని ఆసియా ఫుట్‌బాల్‌ సమాఖ్య ఆరోపించింది. 

ఈ ప్రణాళికను విరమించుకునేంత వరకు ‘ఫిఫా’ అన్నీ టోర్నమెంట్‌లను బహిష్కరించనున్నట్లు యూరోపియన్‌ సాకర్‌ సంస్థ హెచ్చరించింది. తప్పుడు ప్రచారం వల్లే ఈ సమస్య తలెత్తిందని ‘ఫిఫా’ వివరణ ఇచ్చినప్పటికీ... వచ్చే ఏడాది ‘ఫిఫా’ అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో ఇన్‌ఫాంటినో భవితవ్యంపై ఇది తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. 2016 నుంచి గియాని ఇన్‌ఫాంటినో ఈ పదవిలో కొనసాగుతున్నారు. 

2019, 2023 ఎన్నికల్లో విజయం సాధించిన ఆయన... వచ్చే ఏడాది మార్చిలో మొరాకో వేదికగా జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో చివరిసారి పోటీ చేయనున్నారు. ‘ఫిఫా’లో మొత్తం 211 సభ్య దేశాలు ఉండగా... యూరప్, దక్షిణామెరికాలోని 90 దేశాలతో పాటు ఆసియా ఫుట్‌బాల్‌ సమాఖ్యలోని 46 దేశాలు కూడా ఇన్‌ఫాంటినో ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో వచ్చే ఏడాది ఎన్నికలపై దీని ప్రభావం ఉండే అవకాశం ఉంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)