'ఈసారైనా క‌ప్ వ‌చ్చేలా చూడు స్వామి'.. తిరుమలలో ఆర్సీబీ కెప్టెన్‌ పూజలు

Published on Wed, 04/30/2025 - 17:57

ఐపీఎల్‌-2025లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జోరు కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టివ‌ర‌కు 10 మ్యాచ్‌లు ఆడిన ఆర్సీబీ.. 7 విజ‌యాల‌తో పాయింట్ల ప‌ట్టిక‌లో అగ్ర‌స్ధానంలో కొన‌సాగుతోంది. ఆర్సీబీ త‌మ తదుప‌రి మ్యాచ్‌లో మే 3న చిన్న‌స్వామి స్టేడియం వేదిక‌గా చెన్నై సూప‌ర్ కింగ్స్‌తో త‌ల‌ప‌డ‌నుంది. 

ఈ మ్యాచ్‌కు ఇంకా మూడు రోజుల స‌మ‌యం ఉండ‌డంతో ఆర్సీబీ కెప్టెన్ ర‌జిత్ పాటిదార్ తిరుమల శ్రీవారిని ద‌ర్శించుకున్నారు. బుధ‌వారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో పాటిదార్ త‌న స‌హ‌చ‌ర ఆట‌గాడు జితేష్ శ‌ర్మ, టీమిండియా మ‌హిళా క్రికెట‌ర్ శ్రేయంకా పాటిల్‌తో క‌లిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు.

 దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఈ క్రికెట‌ర్ల‌ను ఆశీర్వదించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతోంది. కాగా ఆర్సీబీ కెప్టెన్‌గా తొలిసారి బాధ్య‌త‌లు చేప‌ట్టిన పాటిదార్ జ‌ట్టును అద్బుతంగా న‌డిపిస్తున్నాడు.

బ్యాటింగ్‌, కెప్టెన్సీతో ఆక‌ట్టుకుంటున్నాడు పాటిదార్‌. అత‌డితో పాటు స్టార్ బ్యాట‌ర్ విరాట్ కోహ్లి సైతం అద‌ర‌గొడుతున్నాడు. వ‌రుస హాఫ్ సెంచరీల‌తో ఆర్సీబీ విజ‌యాల్లో కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. బెంగ‌ళూరు మ‌రో రెండు మ్యాచ్‌ల్లో గెలిస్తే త‌మ ప్లే ఆఫ్ బెర్త్‌ను ఖారారు చేసుకుంటుంది.

సీఎస్‌కేతో మ్యాచ్‌కు ఆర్సీబీ తుది జ‌ట్టు(అంచ‌నా)
విరాట్ కోహ్లీ, జాకబ్ బెథెల్, రజత్ పాటిదార్ (కెప్టెన్‌), జితేష్ శర్మ (వికెట్ కీప‌ర్‌), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, రొమారియో షెపర్డ్, భువనేశ్వర్ కుమార్, సుయాష్ శర్మ, జోష్ హేజిల్‌వుడ్, యశ్ దయాల్

 

Videos

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)