Breaking News

పంజాబ్‌తో మ్యాచ్.. ఆర్సీబీ తుది జ‌ట్టు ఇదే? రూ.11 కోట్ల ఆట‌గాడికి నో ఛాన్స్‌?

Published on Mon, 03/25/2024 - 16:40

ఐపీఎల్‌-2024లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు మ‌రో కీల‌క పోరుకు సిద్ద‌మైంది. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా సోమవారం(మార్చి 25) చిన్న‌స్వామి స్టేడియం వేదిక‌గా పంజాబ్ కింగ్స్‌తో ఆర్సీబీ త‌ల‌ప‌డ‌నుంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి బోణీ కొట్టాల‌ని ఆర్సీబీ వ్యూహాలు రచిస్తోంది. ఈ క్ర‌మంలో పంజాబ్‌తో మ్యాచ్‌కు ఆర్సీబీ మెనెజ్‌మెంట్ తమ తుది జ‌ట్టులో ప‌లు మార్పులు చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

తొలి మ్యాచ్‌లో విఫ‌ల‌మైన మిడిలార్డ‌ర్ బ్యాట‌ర్ ర‌జిత్ పాటిదార్‌, అల్జారీ జోష‌ఫ్‌పై వేటు వేయ‌నున్న‌ట్లు స‌మాచారం. పాటిదార్ స్ధానంలో సుయాష్ ప్రభుదేసాయి, జోష‌ఫ్ స్ధానంలో కివీస్ స్టార్ పేస‌ర్ లాకీ ఫెర్గూసన్ తుది జ‌ట్టులోకి రానున్న‌ట్లు ప‌లు రిపోర్ట్‌లు పేర్కొన్నాడు. కాగా సీఎస్‌కేతో జ‌రిగిన తొలి మ్యాచ్‌లో పాటిదార్ డ‌కౌట్ కాగా.. పేస‌ర్‌ జోష‌ఫ్ దారుణంగా విఫ‌ల‌మ‌య్యాడు.

3. 4 ఓవ‌ర్లు బౌలింగ్ చేసిన ఈ కరేబియ‌న్ ఫాస్ట్ బౌల‌ర్‌.. వికెట్ ఏమీ తీయ‌కుండా 38 ప‌రుగులిచ్చాడు. ఈ క్ర‌మంలోనే పాటిదార్, జోష‌ఫ్‌ను ఆర్సీబీ ప‌క్క‌న పెట్టాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. కాగా ఐపీఎల్-2024 మినీవేలంలో జోష‌ఫ్‌ను రూ.11. 50 కోట్ల భారీ ధ‌ర‌కు కొనుగోలు చేసింది. ఇక ఈ మ్యాచ్‌లో పేస‌ర్ యాష్ ద‌యాల్‌ను ఆర్సీబీ ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా ఉప‌యోగించుకునే అవ‌కాశముంది.

ఆర్సీబీ తుది జ‌ట్టు(అంచ‌నా)
విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్, సుయాష్ ప్రభుదేసాయి, గ్లెన్ మాక్స్‌వెల్, కామెరాన్ గ్రీన్, అనుజ్ రావత్ (వికెట్ కీప‌ర్‌), దినేష్ కార్తీక్, లాకీ ఫెర్గూసన్, మ‌యాంక్ దాగ‌ర్‌, కరణ్ శర్మ, మహ్మద్ సిరాజ్.
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)