Breaking News

వారి కంటే గల్లీ క్రికెటర్లే నయం.. దినేశ్‌ కార్తీక్‌ గురించి చెప్పనక్కర్లేదు..!

Published on Sun, 04/23/2023 - 18:00

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా రాజస్థాన్‌ రాయల్స్‌తో ఇవాళ (ఏప్రిల్‌ 23, మధ్యాహ్నం 3:30 గంటలకు) జరుగుతున్న మ్యాచ్‌లో టాస్‌ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ గతంలో మాదిరే మరోసారి భారీ స్కోర్‌ చేసే అవకాశాన్ని చేజార్చుకుంది. డుప్లెసిస్‌ (39 బంతుల్లో 62; 8 ఫోర్లు, 2 సిక్సర్లు), మ్యాక్స్‌వెల్‌ (44 బంతుల్లో 77; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లతో చెలరేగినా ఆ జట్టు భారీ స్కోర్‌ చేయలేక చతికిలపడింది. మ్యాక్సీ, డుప్లెసిస్‌ విజృంభించడంతో ఆర్సీబీ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. 

13 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసి పటిష్టమైన స్థితిలో ఉండిన ఆ జట్టు ఒక్కసారిగా పేకమేడలా కూలిపోయింది. 45 పరుగుల వ్యవధిలో 7 వికెట్లు కోల్పోయి ఉసూరుమనిపించింది. కోహ్లి (0), షాబాజ్‌ అహ్మద్‌ (2), లోమ్రార్‌ (8), దినేశ్‌ కార్తీక్‌ (16), ప్రభుదేశాయ్‌ (0), హసరంగ (6) విజయ్‌కుమార్‌ వైశాఖ్‌ (0) గల్లీ క్రికెటర్ల కంటే హీనంగా బ్యాటింగ్‌ చేశారు. ముఖ్యంగా దినేశ్‌ కార్తీక్‌ అత్యంత దారుణంగా ఆడటమే కాకుండా ఇద్దరు రనౌట్‌ కావడంతో కీలకపాత్ర పోషించాడు. 

బంతిని టచ్‌ చేసేందుకు కూడా ఇబ్బంది పడిన దినేశ్‌ కార్తీక్‌పై ఆర్సీబీ ఫ్యాన్స్‌  తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. వీడెక్కడ దొరికాడు రా బాబు అంటూ తలలు బాదుకుంటున్నారు. కోహ్లి, డుప్లెసిస్‌, మ్యాక్స్‌వెల్‌ లేకపోతే తమ పరిస్థితి ఏంటని బాధపడుతున్నారు. ప్రతి మ్యాచ్‌లో KGF (కోహ్లి, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌, ఫాఫ్‌ డుప్లెసిస్‌) పైనే ఆధారపడటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. వీరు మినహాయించి ఒక్కరంటే ఒక్కరు కూడా బ్యాటింగ్‌లో రాణించలేకపోవడాన్ని​ సహించలేకపోతున్నారు.

మిగతా జట్లలో దేశీయ ఆటగాళ్లు పోటీపడి రాణిస్తుంటే, తమ జట్టులోని ఆటగాళ్లు పెవిలియన్‌కు క్యూకట్టడంతో పోటీపడుతున్నారని వాపోతున్నారు. షాబాజ్‌ అహ్మద్‌, మహిపాల్‌ లోమ్రార్‌, దినేశ్‌ కార్తీక్‌, సుయాశ్‌ ప్రభుదేశాయ్‌లను తూర్పారబెడుతున్నారు. వీరి కంటే గల్లీ క్రికెటర్లు వెయ్యి రెట్లు నయమని అంటున్నారు. వెంటనే వీరిని జట్టు నుంచి తప్పించి, టాలెంటెడ్‌ యంగ్‌ ప్లేయర్లను తీసుకోవాలని ఫ్రాంచైజీ యాజమాన్యాన్ని రిక్వెస్ట్‌ చేస్తున్నారు. 
 

Videos

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

తిరుపతిలో దొంగల బీభత్సం 90 గ్రాముల బంగారం చోరీ!

టీడీపీ దాడులకు భయపడే ప్రసక్తేలేదు.. సజ్జల మాస్ వార్నింగ్

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)