Breaking News

Du Plessis: వయసు మీద పడుతున్నా పాతబడ్డ వైన్‌లా మత్తెక్కిస్తున్నాడు..!

Published on Sun, 04/23/2023 - 18:44

ఆర్సీబీ కెప్టెన్‌ ఫాఫ్‌ డుప్లెసిస్‌ వయసు మీద పడుతున్నా ఆట విషయంలో ఏమాత్రం తగ్గడం లేదు. 38 వయసులోనూ కుర్రాడిలా రెచ్చిపోతూ పరుగుల వరద పారిస్తున్నాడు. గత కొంతకాలంగా పక్కటెముకుల నొప్పితో బాధపడుతున్నప్పటికీ వీరలెవెల్లో విజృంభిస్తున్నాడు.  దాదాపు ప్రతి మ్యాచ్‌లోనూ విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడుతూ కుర్రాళ్లకు సైతం అసూయ పడేలా చేస్తున్నాడు. ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో పట్టపగ్గాలు లేకుండా విజృంభిస్తున్న డుప్లెసిస్‌.. ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో 5 హాఫ్‌ సెంచరీలు చేసి ఆరెంజ్‌ క్యాప్‌ హోల్డర్‌గా కొనసాగుతున్నాడు.

ఈ సీజన్‌లో అతను 7 మ్యాచ్‌ల్లో 67.50 సగటున 165.71 స్ట్రయిక్‌రేట్‌తో 405 పరుగులు సాధించాడు. ఇందులో 33 ఫోర్లు, 25 సిక్సర్లు ఉన్నాయి. ఆరెంజ్‌ క్యాప్‌ రేసులో ఇతని దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు. డుప్లెసిస్‌ భీకర ఫామ్‌ను చూసి సహచర స్టార్‌ ఆటగాళ్లు సైతం ముక్కున వేళ్లేసుకుంటున్నారు. నాలుగు పదుల వయసుకు దగ్గరపడుతున్నా పాతబడ్డ వైన్‌లా ఆటతో మత్తెక్కిస్తున్నాడంటూ స్టేట్‌మెంట్లు ఇస్తున్నారు.

ప్రస్తుత సీజన్‌లో డుప్లెసిస్‌ చేసిన స్కోర్ల వివరాలు..

  • ముంబై ఇండియన్స్‌పై 73(43) 
  • కేకేఆర్‌పై 23(12) 
  • లక్నో సూపర్‌ జెయింట్స్‌పై 79*(46) 
  • ఢిల్లీ క్యాపిటల్స్‌పై 22(16) 
  • చెన్నై సూపర్‌ కింగ్స్‌పై 62(33) 
  • పంజాబ్‌ కింగ్స్‌పై 84(56)
  • రాజస్థాన్‌ రాయల్స్‌పై 62(39)  
     

Videos

గడువు పెరుగుతుందా..? నామినేషన్లపై సుప్రీం ఏం చెప్పనుంది..?

టీడీపీ దౌర్జన్యకాండ.. YSRCP అభ్యర్థుల నామినేషన్లు అడ్డుకోవాలని పిలుపు..

నా ఫ్యామిలీని కాపాడండి.. YSRCP అభ్యర్థి షేక్ ఇమామ్ విజ్ఞప్తి

నీకు దమ్ముంటే.. రా, లోకేశ్‌కు వైసీపీ దాసరి అరుణ బహిరంగ సవాల్!

సారా అర్జున్ సినిమాలు ఎందుకు తగ్గించింది? అసలు కారణం ఇదేనా?

లోకేశ్ బంపర్ ఆఫర్.. రౌడీయిజం చేస్తేనే మంత్రి పదవి లేకపోతే మీ పవర్ కట్..

ఇంట్లో ఉన్న YSRCP MPTC అభ్యర్థిని లాక్కెళ్లిన SI విజయ్

టీడీపీ గూండాలకు పోలీసులు కొమ్ముకాశారు... ఎవరినీ వదిలిపెట్టం

ధర పెరిగిందని పాత బంగారం అమ్మితే లాభమా? నష్టమా? అసలు లెక్క ఇదే

నేనేంటో చూపిస్తా.. బాబుకు దీప్తి రెడ్డి మాస్ వార్నింగ్

Photos

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)