Breaking News

అరంగేట్రంలోనే అదరగొట్టిన విజయ్‌కుమార్‌.. పుత్రోత్సాహంతో పొంగిపోయిన తల్లి

Published on Sun, 04/16/2023 - 13:53

ఢిల్లీ క్యాపటల్స్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో కీలకమైన 3 వికెట్లు (4-0-20-3) పడగొట్టి తన జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించిన రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు పేస్‌ బౌలర్‌ విజయ్‌కుమార్‌ వైశాఖ్‌పై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఆర్సీబీ తరఫున డెబ్యూ మ్యాచ్‌లో అత్యుత్తమ బౌలింగ్‌ గణాంకాలు నమోదు చేసిన వైశాఖ్‌.. డీసీ స్టార్‌ ప్లేయర్‌, ఆ జట్టు కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ ఔట్‌ చేసి ఐపీఎల్‌ వికెట్ల ఖాతా తెరిచాడు. ఆ తర్వాత ఆల్‌రౌండర్లు అక్షర్‌ పటేల్‌, లలిత్‌ యాదవ్‌ల వికెట్లు తీసి ఢిల్లీ పతనాన్ని శాసించాడు.

అరంగేట్రం మ్యాచ్‌లోనే అద్భుతమైన ప్రదర్శన కనబర్చి, రాత్రిరాత్రే స్టార్‌డమ్‌ తెచ్చుకున్న వైశాఖ్‌ను చూసి అతని తల్లి పుత్రోత్సాహంతో పరవశించిపోయింది. మ్యాచ్‌ అనంతరం కొడుకును చూడగానే ఆమె పట్టలేనంత ఆనందంతో బిడ్డను ముద్దాడింది. ఈ సన్నివేశాన్ని చూస్తూ పక్కనే ఉన్న తండ్రి మురిసిపోయాడు. 26 ఏళ్ల వైశాఖ్‌ తమ సొంత ప్రేక్షకుల ముందు తొలి మ్యాచ్‌లోనే విజృంభించడంతో అతని తల్లిదండ్రులు పట్టరాని ఆనందంతో ఉప్పొంగిపోయారు. వైశాఖ్‌ తల్లి అతన్ని ముద్దు పెట్టుకుంటున్న దృశ్యం ప్రస్తుతం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ ఫోటోకు ఆర్సీబీ అభిమానులు పిక్చర్‌ ఆఫ్‌ ది డే అంటూ కామెంట్లు చేస్తున్నారు. 

కాగా, నిన్న (ఏప్రిల్‌ 15) ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో కోహ్లి (50), బౌలింగ్‌లో విజయ్‌కుమార్‌ వైశాఖ్‌ (3/20) రాణించడంతో ఆర్సీబీ 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ సీజన్‌లో ఆర్సీబీకి ఇది రెండు వరుస పరాజయాల తర్వాత వచ్చిన విజయం (రెండవది).   

విజయ్‌కుమార్‌ వైశాఖ్‌ గురించి.. కర్ణాటకకు చెందిన విజయ్‌కుమార్‌ వైశాఖ్‌‌ 2020-21 సీజన్‌లో విజయ్‌హజారే ట్రోఫీలో కర్ణాటక తరఫున దేశవాలీ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు.  ఆ తర్వాత సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ ద్వారా టీ20 క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. వైశాఖ్‌.. కర్ణాటక తరఫున 2021-22 రంజీ ట్రోఫీ కూడా ఆడాడు.

వైశాఖ్‌.. ఇప్పటివరకు 10 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ల్లో 38 వికెట్లు, 14 టీ20ల్లో 22 వికెట్లు, 7 లిస్ట్‌-ఏ మ్యాచ్‌ల్లో 11 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌ సందర్భంగా రజత్‌ పాటిదార్‌ గాయపడడంతో అతని స్థానంలో వైశాఖ్‌ ఆర్సీబీలోకి వచ్చాడు.   
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)