IPL 2025: ఆర్సీబీకి ఝులక్ ఇచ్చిన ఎస్‌ఆర్‌హెచ్‌.. టాప్‌-2 కష్టమే?

Published on Fri, 05/23/2025 - 23:39

ఐపీఎల్‌-2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కు సన్‌రైజర్స్ హైదరాబాద్ బిగ్ షాకిచ్చింది. లక్నో వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీపై 42 పరుగుల తేడాతో ఎస్‌ఆర్‌హెచ్ విజయం సాధించింది. 232 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ 19.5 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌటైంది

ఆర్సీబీ బ్యాటర్లలో ఫిల్ సాల్ట్‌(62), విరాట్ కోహ్లి(43) అద్బుత ఇన్నింగ్స్‌లు ఆడినప్పటికి మిడిలార్డర్ విఫలం కావడంతో ఆర్సీబీ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్లలో ప్యాట్ కమ్మిన్స్ మూడు వికెట్లు పడగొట్టగా.. ఇషాన్ మలింగ రెండు, ఉనద్కట్‌, దూబే, నితీష్ కుమార్ రెడ్డి, హర్షల్‌ పటేల్‌ తలా వికెట్ సాధించారు. ఈ ఓటమితో పాయింట్ల పట్టికలో ఆర్సీబీ మూడో స్దానానికి పడిపోయింది. టాప్‌-2లో గుజరాత్‌,పంజాబ్‌ కొనసాగుతున్నాయి.

 ఇషాన్ సూపర్ ఇన్నింగ్స్‌..
అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఎస్‌ఆర్‌హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 231 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటర్లలో ఇషాన్ కిషన్ అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 48 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో కిషన్ 94 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు.

అతడితో పాటు అభిషేక్ శర్మ(17 బంతుల్లో 34), క్లాసెన్‌(24), హెడ్‌(17), అనికేత్ వర్మ(9 బంతుల్లో 26) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. ఆర్సీబీ బౌలర్లలో రొమారియో షెపర్డ్ రెండు వికెట్లు పడగొట్టగా.. సుయాష్‌, ఎంగిడీ,భువనేశ్వర్‌, పాం‍డ్యా తలా వికెట్ సాధించారు.
చదవండి: WI vs IRE: వెస్టిండీస్ వీరుడి విధ్వంసం.. వన్డేల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ!

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)