Breaking News

మైనర్‌పై అత్యాచారం.. ఆర్సీబీ స్టార్‌ ప్లేయర్‌పై పోక్సో కేసు

Published on Fri, 07/25/2025 - 12:00

రాయల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు స్టార్ పేస‌ర్ య‌శ్ ద‌యాల్ మ‌రో వివాదంలో చిక్కుకున్నాడు. క్రికెట్‌లో అద్భుత కెరీర్‌ చూపిస్తానని నమ్మించి.. రెండేళ్లుగా యశ్‌ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని జైపూర్‌కు చెందిన ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

దీంతో  జైపూర్‌ పోలీసులు యశ్‌ దయాల్‌పై పోక్సో కేసు నమోదు చేశారు. ప్రస్తుతం బాధితురాల వయస్సు 19 ఏళ్లని, దయాల్‌కు పరిచియమైనప్పుడు మాత్రం ఆమె మైనర్‌ అని పోలీసులు వెల్లడించారు. జైపుర్‌లో ఐపీఎల్‌ మ్యాచ్‌ సందర్భంగా తొలిసారి తాను యశ్‌ దయాల్‌ను కలిసినట్లు బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. 

ఐపీఎల్‌-2025 సందర్భంగా కూడా దయాల్‌ తనపై ఆత్యాచారానికి పాల్పడినట్లు ఆమె ఆరోపిస్తోంది. ఈ ఏడాది ఐపీఎల్‌ సీజన్‌లో ఏప్రిల్‌ 13న ఆర్సీబీ, రాజస్తాన్‌ రాయల్స్ జట్లు జైపూర్‌లో తలపడ్డాయి. ఈ క్రమంలో దయాల్‌ జైపూర్‌కు వచ్చినప్పుడు బాధితురాలిని సీతాపుర హోటల్‌కు పిలిపించి మరోసారి అఘాయిత్యానికి పాల్పడినట్లు ఎఫ్‌ఐర్‌లో నమోదైంది.

అతడిపై ఈ నెల 23న పోలీసులకు సదరు యువతి ఫిర్యాదు చేసినట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. కాగా ఈ ఆర్సీబీ ఆటగాడిపై ఇప్పటికే ఓ లైంగిక వేదింపుల కేసు నమోదైంది. ఇటీవలే ఘజియాబాద్‌కు చెందిన ఒక అమ్మాయి దయాల్‌పై ఫిర్యాదు చేసింది. అయితే ఈ కేసులో అతడి అరెస్టుపై అలహాబాద్‌ హైకోర్టుపై స్టే విధించింది.
చదవండి: అది నా చేతుల్లో లేదు.. అంతా కెప్టెన్ ఇష్ట‌మే: శార్ధూల్‌ ఠాకూర్‌
 

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)