Breaking News

బెంగళూరు ధనాధన్‌... 

Published on Wed, 02/28/2024 - 04:23

బెంగళూరు: మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) టి20 క్రికెట్‌ టోర్నీ రెండో సీజన్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) ధనాధన్‌ ఆటతీరుతో వరుసగా రెండో విజయాన్ని సాధించింది. మంగళవారం జరిగిన పోరులో బెంగళూరు 8 వికెట్ల తేడాతో గుజరాత్‌ జెయింట్స్‌పై ఘనవిజయం సాధించింది. 7.3 ఓవర్లు మిగిలుండగానే స్మృతి మంధాన బృందం లక్ష్యాన్ని ఛేదించింది.

మొదట బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 107 పరుగులే  చేసింది. ఓపెనర్‌ హర్లీన్‌ డియోల్‌ (31 బంతుల్లో 22; 3 ఫోర్లు), హేమలత (25 బంతుల్లో 31 నాటౌట్‌; 2 ఫోర్లు, 1 సిక్స్‌) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ రేణుక సింగ్‌ (2/14) స్వింగ్‌ బౌలింగ్‌కు మేటి బ్యాటర్లు బెత్‌ మూనీ (8), లిచ్‌ఫీల్డ్‌ (5) తలవంచారు. వేద కృష్ణమూర్తి (9), ఆష్లే గార్డ్‌నర్‌ (7)లు కూడా సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు.

లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ సోఫీ మోలినెక్స్‌ (3/25) గుజరాత్‌ను కోలుకోని విధంగా దెబ్బతీసింది. ఆర్‌సీబీ ఏకంగా ఏడుగురు బౌలర్లను ప్రయోగించింది. అనంతరం సులువైన లక్ష్యాన్ని బెంగళూరు 12.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 110 పరుగులు చేసి గెలిచింది. కెప్టెన్, ఓపెనర్‌ స్మృతి మంధాన (27 బంతుల్లో 43; 8 ఫోర్లు, 1 సిక్స్‌) చెలరేగింది.

సహచర ఓపెనర్‌ సోఫీ డివైన్‌ (6) ఆరంభంలోనే నిష్క్రమించినా... వన్‌డౌన్‌ బ్యాటర్, ఆంధ్రప్రదేశ్‌ అమ్మాయి సబ్బినేని మేఘన (28 బంతుల్లో 36 నాటౌట్‌; 5 ఫోర్లు, 1 సిక్స్‌)తో కలిసి చకాచకా పరుగులు సాధించింది. ఇన్నింగ్స్‌ 9వ ఓవర్లో తనూజ (1/20) స్మృతి వేగానికి కళ్లెం వేసింది.

అయితే మేఘన, ఎలీస్‌ పెరీ (14 బంతుల్లో 23 నాటౌట్‌; 4 ఫోర్లు) మరో వికెట్‌ పడకుండా తమ కెపె్టన్‌లాగే ధనాధన్‌ ఆటతీరును కొనసాగించారు. దాంతో 13వ ఓవర్‌ పూర్తికాకముందే బెంగళూరు విజయతీరాలకు చేరుకుంది. నేడు జరిగే మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో యూపీ వారియర్స్‌ తలపడుతుంది.  

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)