చరిత్ర సృష్టించిన ఆర్సీబీ.. తొలి జట్టుగా రికార్డు

Published on Fri, 05/30/2025 - 09:39

తొలి ఐపీఎల్ టైటిల్‌ను ముద్దాడేందుకు రాయల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు అడుగు దూరంలో నిలిచింది. ఐపీఎల్‌-2025లో ఫైన‌ల్ బెర్త్‌ను ఆర్సీబీ ఖారారు చేసుకుంది. గురువారం ముల్లాన్‌పూర్ వేదిక‌గా జ‌రిగిన తొలి క్వాలిఫయ‌ర్‌లో పంజాబ్ కింగ్స్‌ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసిన ఆర్సీబీ.. నాలుగోసారి ఈ క్యాష్‌రిచ్ లీగ్ ఫైన‌ల్లో అడుగుపెట్టింది. ఈ మ్యాచ్‌లో బౌలింగ్‌, బ్యాటింగ్‌లో అద్బుతంగా రాణించింది. 

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్‌.. ఆర్సీబీ బౌల‌ర్లు చెల‌రేగ‌డంతో కేవలం 14.1 ఓవర్లలో 101 పరుగులకే కుప్పకూలింది. పంజాబ్ ఇన్నింగ్స్‌లో మార్కస్ స్టోయినిస్ (17 బంతుల్లో 26 పరుగులు; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిల‌వ‌గా.. మిగితా ప్లేయ‌ర్లంతా దారుణంగా విఫ‌ల‌మ‌య్యారు. అనంత‌రం 102 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఆర్సీబీ కేవ‌లం రెండు వికెట్లు మాత్ర‌మే కోల్పోయి చేధించింది. ఇక ఈ మ్యాచ్‌లో అద్బుత విజ‌యం సాధించిన బెంగ‌ళూరు టీమ్ పలు  అరుదైన రికార్డులను త‌మ ఖాతాలో వేసుకుంది.

ఆర్సీబీ సాధించిన రికార్డులు ఇవే..
👉ఐపీఎల్ ప్లే ఆఫ్స్ చరిత్రలో ప్రత్యర్ధిని 15 ఓవర్లలోపే ఆలౌట్ చేసిన తొలి జట్టుగా ఆర్సీబీ రికార్డులెక్కింది. ఇప్పటివరకు ఏ జట్టు కూడా ఈ ఫీట్ సాధించలేదు.

👉అదేవిధంగా ఐపీఎల్ ప్లే ఆఫ్ మ్యాచ్‌(20 ఓవర్ల ఫుల్ గేమ్‌)లో బంతులపరంగా అతిపెద్ద విజయాన్ని సాధించిన జట్టుగా బెంగళూరు నిలిచింది. ఈ మ్యాచ్‌ను ఆర్సీబీ 60 బంతులు మిగిలూండ‌గానే ముగించింది. ఇంతకుముందు ఈ రికార్డు కోల్‌కతా నైట్‌రైడర్స్ పేరిట ఉండేది. ఐపీఎల్‌-2024 ఫైనల్లో ఎస్‌ఆర్‌హెచ్‌పై 57 బంతులు మిగిలూండగానే కేకేఆర్‌ విజయం సాధించింది. తాజా మ్యాచ్‌తో కేకేఆర్‌ నైట్‌రైడర్స్ రికార్డును ఆర్సీబీ బ్రేక్ చేసింది.

👉అయితే 2017 సీజ‌న్‌లో ఎలిమినేట‌ర్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌పై కేకేఆర్‌ కేవ‌లం 5.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. కానీ ఆ మ్యాచ్‌ను వర్షం కారణంగా ఆరు ఓవర్లకు కుదించారు.
 

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)