Breaking News

బెంగళూరు దుర్ఘటనపై స్పందించిన ఆర్సీబీ యాజమాన్యం

Published on Thu, 06/05/2025 - 10:25

నిన్న (జూన్‌ 4) జరిగిన బెంగళూరు దుర్ఘటనపై ఆర్సీబీ యాజమాన్యం స్పందించింది. ఊహించని ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసింది. క్షమాపణలు చెబుతూ మీడియా లేఖను విడుదల చేసింది. ఈ దురదృష్టకర ఘటనతో తీవ్ర వేదనకు గురయ్యామని తెలిపింది. తొక్కిసలాటలో మృతి చెందిన వారికి సంతాపం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేసింది. అభిమానులు, బెంగళూరు ప్రజల భద్రత, శ్రేయస్సు తమకు ముఖ్యమని పేర్కొంది. కర్ణాటక రాష్ట్ర క్రికెట్‌ అసోసియేషన్‌తో కలిసి 5 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.

కాగా, ఆర్సీబీ తొలిసారి ఐపీఎల్‌ ట్రోఫీ గెలిచిన నేపథ్యంలో నిన్న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆటగాళ్లకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఊహించని రీతిలో రెండు లక్షలకు పైగా అభిమానులు తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది. ఇందులో 11 మంది ప్రాణాలు కోల్పోగా, 47 మంది​కి పైగా గాయపడ్డారు. ఈ ఘటనపై యావత్‌ క్రీడా ప్రపంచం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం 10 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ 2 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. 

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)