Breaking News

రూ.11 కోట్లు తీసుకున్నాడు.. ఆర్సీబీని నిండా ముంచేశాడు!

Published on Sat, 03/30/2024 - 06:40

ఐపీఎల్‌-2024లో వెస్టిండీస్ పేసర్‌, రాయల్ ఛాలెంజర్స్‌​ బెంగళూరు ఫాస్ట్ బౌలర్ అల్జారీ జోసెఫ్ దారుణ  ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రుస్తున్నాడు. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఘోరంగా విఫ‌ల‌మైన జోసెఫ్.. తాజాగా కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లోనూ తీవ్రంగా నిరాశ‌ప‌రిచాడు. ఈ మ్యాచ్‌లో రెండు ఓవ‌ర్లు బౌలింగ్ చేసిన అతడు.. 17.00 ఎకాన‌మితో ఏకంగా 34 ప‌రుగులు స‌మ‌ర్పించుకున్నాడు.

కేకేఆర్ ఓపెన‌ర్ సునీల్ నరైన్‌.. జోసెఫ్ బౌలింగ్‌ను ఊచ‌కోత కోశాడు. అతడు వేసిన తొలి ఓవ‌ర్‌లోనే 2 సిక్స్‌లు బాది తీవ్ర ఒత్తిడిలోకి నెట్టాడు. కాగా ఈ ఏడాది సీజ‌న్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 3 మ్యాచ్‌లు ఆడిన జోసెఫ్ కేవ‌లం ఒకే ఒక్క వికెట్ ప‌డ‌గొట్టాడు. ఈ క్ర‌మంలో అతడు వ‌రుస‌గా విఫ‌ల‌మవుతున్న‌ప్ప‌టికి ఇంకా ఛాన్స్‌లు క‌ల్పిస్తున్న ఆర్సీబీ మేనెజ్‌మెంట్ తీరును ఫ్యాన్స్ త‌ప్పుబడుతున్నారు.

అత‌డి స్ధానంలో లూకీ ఫెర్గూస‌న్ లేదా టోప్లీకి అవ‌కాశ‌మివ్వాల‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు. కాగా  ఈ ఐపీఎల్‌-2024 వేలంలో జోసెఫ్‌ను ఆర్సీబీ ఏకంగా రూ.11.50 కోట్లు వెచ్చించి మ‌రి కొనుగోలు చేసింది. కానీ జోసెఫ్ మాత్రం త‌న తీసుకున్న డ‌బ్బుల‌కు న్యాయం చేయ‌లేక‌పోతున్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో ఆర్సీబీపై 7 వికెట్ల తేడాతో కేకేఆర్ ఘ‌న విజ‌యం సాధించింది.

183 ప‌రుగుల ల‌క్ష్యాన్ని కేకేఆర్ కేవ‌లం 16.5 ఓవ‌ర్ల‌లో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కేకేఆర్ బ్యాట‌ర్ల‌లో వెంక‌టేశ్ అయ్య‌ర్‌(50) ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా.. సునీల్ న‌రైన్‌(22 బంతుల్లో 47), కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్‌(39 నాటౌట్‌) అద్భుత‌మైన ఇన్నింగ్స్‌లు ఆడారు. అంత‌కుముందు బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో విరాట్ కోహ్లి(83) మరోసారి సూపర్‌ ఇన్నింగ్స్ ఆడాడు. కానీ ఆర్సీబీని గెలిపించలేకపోయాడు.

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి