Breaking News

ఆర్సీబీలోకి విధ్వంసకర ఆల్‌రౌండర్‌.. ఇక ప్రత్యర్ది బౌలర్లకు చుక్కలే!

Published on Fri, 03/17/2023 - 12:34

ఐపీఎల్‌-2023 సీజన్‌కు ఆరంభానికి ముందు రాయల్‌ ఛాలంజర్స్‌ బెంగళూరుకు మరో బిగ్‌ షాక్‌ తగిలింది. వేలంలో రూ.3.2 కోట్ల భారీ ధర వెచ్చించి కొనుగోలు చేసిన ఇంగ్లీష్ ఆల్ రౌండర్ విల్ జాక్స్ మోకాలి గాయం కారణంగా ఈ ఏడాది సీజన్‌ మొత్తానికి దూరమయ్యాడు.

బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌ సందర్భంగా గాయపడ్డ జాక్స్‌.. సిరీస్‌ మధ్యలోనే స్వదేశానికి పయనమయ్యాడు. అతడు గాయం నుంచి కోలుకోవడానికి దాదాపు నాలుగు నుంచి ఐదు వారాల సమయం పట్టనున్నట్లు ఈసీబీ వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలోనే అతడు ఐపీఎల్‌ 16వ సీజన్‌కు దూరమయ్యాడు.

ఆర్సీబీలోకి మైఖేల్ బ్రేస్‌వెల్..
ఇక విల్ జాక్స్ స్థానాన్ని న్యూజిలాండ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ మైఖేల్ బ్రేస్‌వెల్‌తో భర్తీ చేయాలని ఆర్సీబీ మెనెజెమెంట్‌ భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే బ్రేస్‌వెల్‌తో ఆర్సీబీ సంప్రదింపులు కూడా జరిపినట్లు తెలుస్తోంది. కాగా బ్రెస్‌వెల్‌ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ ఏడాది ఆరంభంలో కివీస్‌ భారత పర్యటనలో భాగంగా బ్రేస్‌వెల్‌ అద్భుతంగా రాణించాడు.

హైదరాబాద్‌ వేదికగా టీమిండియా జరిగిన తొలి వన్డేలో బ్రెస్‌వెల్‌.. కేవలం 78 బంతుల్లోనే 140 పరుగులు సాధించి బౌలర్లకు చుక్కలు చూపించాడు. అదే విధంగా బంతితో కూడా బ్రెస్‌వెల్‌ అకట్టుకున్నాడు. ఈ నేపథ్యంలోనే బ్రేస్‌వెల్‌పై ఆర్సీబీ కన్నేసింది. కాగా మార్చి 31 నుంచి ఐపీఎల్‌ 16వ సీజన్‌ ప్రారంభం కానుంది.
చదవండి: IND vs AUS: ఆస్ట్రేలియాతో తొలి వన్డే.. ఫీల్డింగ్‌ కోచ్‌గా మారిన ద్రవిడ్‌! వీడియో వైరల్‌

Videos

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)