#RCB: చరిత్ర సృష్టించిన ఆర్సీబీ.. తొలి ఐపీఎల్‌ జట్టుగా

Published on Mon, 05/26/2025 - 18:17

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురుంచి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు ఒక్కసారి కూడా టైటిల్‌ను సొంతం చేసుకోపోయినప్పటికి.. ఆర్సీబీని అభిమానించే వాళ్లు కోట్ల సంఖ్యలో ఉన్నారు. ఈ క్రమంలో బెంగళూరు ఓ డిజిటల్ మైలురాయిని అందుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో 2 కోట్ల మంది ఫాలోవర్లను దాటిన తొలి ఐపీఎల్ ఫ్రాంచైజీగా బెంగళూరు అవతరించింది.

ఈ ఏడాది ఏప్రిల్ ఆరంభంలో ఆర్సీబీ ఇన్‌స్టా ఫాలోవర్ల సంఖ్య 18 మిలియన్లగా ఉండేది. ఇప్పుడు కేవలం నెల రోజుల వ్యవధిలోనే ఆ సంఖ్య 20 మిలియన్లకు చేరింది. ఈ క్ర‌మంలో చెన్నై సూప‌ర్ కింగ్స్ (18.6 మిలియ‌న్లు), ముంబై ఇండియ‌న్స్ (18 మిలియ‌న్లు)ల‌ను బెంగ‌ళూరు ఫ్రాంచైజీ దాటిసేంది.

ఇక ఈ ఏడాది సీజ‌న్‌లో ఆర్సీబీ అద్బుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రుస్తోంది. ఇప్ప‌టికే ప్లే ఆఫ్స్‌కు ఆర్హ‌త సాధించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. టాప్‌-2 స్ధానం కోసం ప్ర‌య‌త్నిస్తోంది. ఆర్సీబీకి ఇంకా ఒక మ్యాచ్ మిగిలి ఉంది. మే 27న ఏకానా స్టేడియం వేదిక‌గా ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌తో బెంగ‌ళూరు త‌ల‌ప‌డ‌నుంది.

ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ విజ‌యం సాధిస్తే పాయింట్ల ప‌ట్ట‌కలో టాప్‌-2 స్ధానానికి చేరుకుంటుంది. ఇప్ప‌టివ‌ర‌కు 13 మ్యాచ్‌లు ఆడిన రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్‌.. ఎనిమిదింట విజ‌యాలో పాయింట్ల ప‌ట్టిక‌లో మూడో స్ధానంలో కొన‌సాగుతోంది.

ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధికంగా ఫాలో అవుతున్న ఐపీఎల్ జట్లు ఇవే:
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) - 20 మిలియన్లు
చెన్నై సూపర్ కింగ్స్ (CSK)- 18.6 మిలియన్లు
ముంబై ఇండియన్స్ (MI)- 18 మిలియన్లు
కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)- 7.5 మిలియన్లు
సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)- 5.4 మిలియన్లు
 

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)