ఆర్సీబీకి కొత్త హెడ్ కోచ్‌..

Published on Tue, 11/04/2025 - 14:35

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) 2026 సీజ‌న్‌కు ముందు  డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) త‌మ కోచింగ్ స్టాప్‌లో కీల‌క మార్పులు చేసింది.  త‌మ జ‌ట్టు కొత్త హెడ్ కోచ్‌గా త‌మిళ‌నాడు మాజీ క్రికెట‌ర్ మలోలన్ రంగరాజన్‌ను ఆర్సీబీ యాజ‌మాన్యం నియ‌మించింది.

రెగ్యూల‌ర్ హెడ్ కోచ్ ల్యూక్ విలియమ్స్ బిగ్ బాష్ లీగ్ (BBL)లో అడిలైడ్ స్ట్రైకర్స్‌తో ఒప్పందం కుద‌ర్చుకోవ‌డంతో రాబోయే డ‌బ్ల్యూపీఎల్ ఎడిష‌న్‌కు దూరంగా ఉండ‌నున్నాడు. ఈ క్ర‌మంలోనే విలియమ్స్ స్ధానాన్ని రంగరాజన్‌తో ఆర్సీబీ భ‌ర్తీ చేసింది.  రంగరాజన్  గతంలో ఆర్సీబీ పురుషుల, మహిళల జట్లకు స్కౌట్, ఫీల్డింగ్ కోచ్‌గా పనిచేశారు. 

మ‌రోవైపు ఇంగ్లండ్ మాజీ నేస‌ర్ అన్యా ష్రబ్సోల్ (Anya Shrubsole)ను త‌మ బౌలింగ్ కోచ్‌గా ఆర్సీబీ ఎంపిక చేసింది. అన్యా గ‌తంలో ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మంధానతో కలిసి 'ది హండ్రెడ్'లో సదరన్ బ్రేవ్ తరఫున ఆడింది.   ష్రబ్సోల్..గ‌త సీజ‌న్ వ‌ర‌కు బౌలింగ్ కోచ్‌గా ప‌నిచేసిన‌ సునేత్ర పరంజాపే స్థానంలో బాధ్యతలు చేప‌ట్ట‌నుంది. 

ష్రబ్సోల్ ఇంగ్లండ్‌ తరఫున 86 వన్డేలు, 79 టీ20లు,  8 టెస్ట్‌లు ఆడింది. ఇక బ్యాటింగ్ కోచ్‌గా ఆర్ మురళీధర్, హెడ్ ఫిజియోగా నవనీత గౌతమ్ తమ ప‌ద‌వుల్లో కొన‌సాగనున్నారు. కాగా ఈ నెలాఖరులో డబ్ల్యూపీల్ మినీ వేలం జరగనుంది. నవంబర్ 5లోపు ఆయా ఫ్రాంచైజీలు ఆటగాళ్ల రిటెన్షన్ జాబితాను సమర్పించాలి.
చదవండి: బిగ్‌బాష్‌ లీగ్‌ నుంచి అశ్విన్‌ ఔట్‌

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)