Breaking News

రాయుడు రిటైర్‌ అయ్యాడు.. మీకు తప్పకుండా జట్టులో చోటిస్తాం.. కానీ: ధోని

Published on Tue, 07/11/2023 - 12:56

MS Dhoni Hilarious Response Over Yogi Babu Wanting To Join CSK: టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని మైదానంలో ఎంత చురుగ్గా ఉంటాడో.. ఆఫ్‌ ది ఫీల్డ్‌ అంతే సరదాగా ఉంటాడు. ఆటలో కెప్టెన్సీ నైపుణ్యాలతో ఆకట్టుకునే తలా.. ప్రస్తుతం సినీ నిర్మాతగా కొత్త అవతారమెత్తిన విషయం తెలిసిందే. చెన్నై సూపర్‌ కింగ్స్‌తో పెనవేసుకున్న బంధాన్ని మరింత పదిలం చేసుకుంటూ సౌత్‌ ఇండస్ట్రీలో ధోని ఎంటర్టైన్‌మెంట్‌ పేరిట నిర్మాణ రంగంలోకి దిగాడు.

లెట్స్‌ గెట్‌ మ్యారీడ్‌
తమ బ్యానర్‌పై తెరకెక్కిన తొలి సినిమా LGM (Let's Get Married) ట్రైలర్‌, ఆడియో లాంచ్‌ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. చెన్నైలో జరిగిన ఈ ఈవెంట్‌లో ధోని, అతడి సతీమణి సాక్షి తమ చేతుల మీదుగా ట్రైలర్‌ను ఆవిష్కరించారు. LGMలో నటించిన హరీశ్‌ కళ్యాణ్‌, నదియా, ఇవానా, కమెడియన్‌ యోగిబాబు, ఆర్జే విజయ్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సీఎస్‌కేకు ఆడాలని ఉంది
ఈ సందర్భంగా యోగిబాబు తనదైన శైలిలో హాస్యం పండించాడు. అంతేకాదు తనకు చెన్నై సూపర్‌ కింగ్స్‌లో భాగం కావాలని ఉందంటూ తన మనసులో ఉన్న కోరికను ధోని ముందు బయటపెట్టాడు. ఇందుకు ధోని కూడా అంతే సరదాగా స్పందించాడు. ‘‘రాయుడు రిటైర్‌ అయ్యాడు. కాబట్టి సీఎస్‌కేలో మీకు తప్పకుండా చోటు ఉంటుంది. మేనేజ్‌మెంట్‌తో నేను మాట్లాడతాను.

కానీ మీరిప్పుడు సినిమాల్లో బిజీగా ఉన్నారు కదా!నేనైతే మీరు ఎల్లప్పుడు జట్టుతో ఉంటూ నిలకడగా ఆడాలని కోరుకుంటా. కానీ వాళ్లు మాత్రం ఫాస్ట్‌ బౌలింగ్‌తో మిమ్మల్ని గాయపరుస్తారు మరి జాగ్రత్త’’ అని తలా యోగిబాబుకు బదులిచ్చాడు. దీంతో అక్కడ నవ్వులు పూశాయి.

రాయుడు అరుదైన ఘనత
అంబటి రాయుడు ఐపీఎల్‌-2023 తర్వాత క్యాష్‌ రిచ్‌ లీగ్‌కు గుడ్‌ బై చెప్పిన విషయం తెలిసిందే. ఇక ఈ ఎడిషన్‌లో చెన్నై టైటిల్‌ గెలిచి ఏకంగా ఐదోసారి చాంపియన్‌గా నిలవడంతో రాయుడు అరుదైన రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్‌లో మొత్తంగా ఆరుసార్లు(ముంబై ఇండియన్స్‌ తరఫున 3, సీఎస్‌కే తరఫున 3) విజేతగా నిలిచిన జట్టులో భాగమైన ఆటగాడిగా చరిత్రకెక్కాడు. ముంబై సారథి రోహిత్‌ శర్మ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో క్రికెటర్‌గా నిలిచాడు.

చదవండి: సిక్సర్ల రింకూ.. ఎక్కడా తగ్గేదేలే! వీడియోతో సెలక్టర్లకు దిమ్మతిరిగేలా!
తల్లిదండ్రుల కష్టం ఏమిటో అర్థం చేసుకోలేని స్థితిలోనూ! శెభాష్‌ బిడ్డా..

Videos

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు