రవీంద్ర జడేజా అరుదైన ఘనత.. శ్రీనాథ్‌ రికార్డు బద్దలు

Published on Sat, 01/27/2024 - 17:08

టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన ఆరో భారత బౌలర్‌గా జడేజా నిలిచాడు. హైదరాబాద్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో బెయిర్‌ స్టోను ఔట్‌ చేసిన జడ్డూ.. ఈ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. జడేజా ఇప్పటివరకు మూడు ఫార్మాట్లలో 332 మ్యాచ్‌లు ఆడి 552 వికెట్లు పడగొట్టాడు.

ఈ క్రమంలో భారత మాజీ పేసర్‌ జవగల్ శ్రీనాథ్‌ను జడేజా అధిగమించాడు. శ్రీనాథ్‌ తన అంతర్జాతీయ కెరీర్‌లో 551 వికెట్లు సాధించాడు. ఇక అరుదైన ఘనత సాధించిన జాబితాలో భారత స్పిన్‌ దిగ్గజం అనిల్‌ కుంబ్లే 953 వికెట్లతో తొలి స్ధానంలో ఉన్నాడు. ఆ తర్వాతి స్ధానంలో టీమిండియా వెటరన్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ 723 వికెట్లతో కొనసాగుతున్నాడు.

ఇక  మ్యాచ్‌ విషయానికి వస్తే.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్‌ తమ రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్ల నష్టానికి 316 పరుగులు చేసింది. వన్‌డౌన్‌ బ్యాటర్‌ ఒలీ పోప్‌ అద్భుత సెంచరీతో చెలరేగాడు. పోప్‌ (148), రెహాన్‌ అహ్మద్‌ (16) పరుగులతో క్రీజులో ఉన్నారు.  ఇంగ్లండ్‌ ప్రస్తుతం సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో 126 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. అంతకుముందు భారత్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 436 పరుగులకు ఆలౌటైంది. 

Videos

వృద్ధుడిని కూడా వదలరా? సొంత పార్టీ నేతలపై టీడీపీ గూండాల దాడులు

26నుంచి భారీ వర్షాలు

మహిళల జుట్టు పట్టుకోవడం, చీరలు లాగడం ఏ రకమైన పాలనకు నిదర్శనం?

దాడుల వెనుక టార్గెట్.. రెడ్డి వర్గం..! ఇంద్రనీల్ సంచలన నిజాలు

ముంచుకొస్తున్న అర్ణబ్ తుపాను

ఎల్లో మూకలపై శివంగుల్లా తిరగబడ్డ మహిళలే మాకు స్ఫూర్తి

నేడు భారత్ -న్యూజిలాండ్ మధ్య రెండో T20 మ్యాచ్

జగనన్న మళ్లీ వస్తేనే రాష్ట్రంలో మహిళలకు రక్షణ

2029 నీకు పుట్టగతులు ఉండవ్..! పరిటాల సునీతకు గోరంట్ల మాస్ వార్నింగ్

నా సర్వీసులో ఇలాంటి ఎన్నికలు ఎప్పుడూ చూడలేదు

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)