Breaking News

ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌.. రవీంద్ర జడేజా కీలక నిర్ణయం

Published on Sun, 01/15/2023 - 16:16

స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరగున్న టెస్టు సిరీస్‌తో టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా పునరాగమనం చేయనున్నాడు. ఆస్ట్రేలియాతో తొలి రెండు టెస్టులకు బీసీసీఐ ప్రకటించిన జట్టులో జడేజాకు చోటు దక్కింది. అయితే జడేజాను ఎంపికచేసినప్పటికీ ప్రధాన జట్టులో చోటు మాత్రం అతడి ఫిట్‌నెస్‌పై ఆధారపడి ఉంటుంది సెలక్టర్లు పేర్కొన్నారు. 

ఈ క్రమంలో జడ్డూ తన ఫిట్‌నెస్‌ నిరూపించుకునేందుకు ప్రస్తుతం జరగుతున్న రంజీ ట్రోఫీలో ఆడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. జనవరి 24 నుంచి చెన్నై వేదికగా తమిళనాడుతో జరగనున్న మ్యాచ్‌లో జడేజా సౌరాష్ట్ర తరపున బరిలోకి దిగనున్నట్లు ఈఎస్‌స్పీన్‌ క్రిక్‌ ఇన్‌ఫో పేర్కొంది. 

కాగా గతేడాది ఆసియాకప్‌ తర్వాత మోకాలి గాయం కారణంగా జడేజా జట్టుకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక గాయం నుంచి పూర్తిగా కోలుకున్న జడేజా ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్‌ క్రికెట్‌ అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు.
ఆస్ట్రేలియాతో తొలి రెండు టెస్టులకు భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్‌), కెఎల్ రాహుల్ ((వైస్‌ కెప్టెన్‌), శుభమన్ గిల్, సి పుజారా, వి కోహ్లి, ఎస్ అయ్యర్, కెఎస్ భరత్ (వికెట్‌ కీపర్‌), ఇషాన్ కిషన్ (వికెట్‌ కీపర్‌), ఆర్ అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్. షమీ, మొహమ్మద్. సిరాజ్, ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్, సూర్యకుమార్ యాదవ్
చదవండి: BBL 2022 23: పంజాబ్‌ కింగ్స్‌ బౌలర్‌ హ్యాట్రిక్‌.. ముంబై ఇండియన్స్‌ బ్యాటర్‌ విధ్వంసం

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)