Breaking News

జడేజా దెబ్బకు స్మిత్‌ మైండ్‌ బ్లాంక్‌.. వీడియో చూసి తీరాల్సిందే?

Published on Thu, 02/09/2023 - 16:10

టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా ఘనమైన పునరాగమనం చేశాడు. నాగ్‌పూర్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతోన్న తొలి టెస్టులో జడేజా అదరగొట్టాడు. ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 22 ఓవర్లు వేసిన జడ్డూ 47 పరుగులిచ్చి ఐదు వికెట్లు తీశాడు. ముఖ్యంగా ఆస్ట్రేలియా స్టార్‌ బ్యాటర్‌ స్టీవ్‌ స్మిత్‌ను జడేజా ఔట్‌ చేసిన తీరు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.

అప్పటికే క్రీజులో పాతుకుపోవడానికి ప్రయత్నిస్తున్న స్మిత్‌ను అద్భుతమైన బంతితో స్మిత్‌ బోల్తా కొట్టించాడు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ 42 ఓవర్‌లో జడేజా వేసిన ఆఖరి బంతికి స్మిత్‌ ఢిఫెన్స్‌ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే ఆఫ్‌సైడ్‌ పడిన బంతి ఒక్కసారిగా టర్న్‌ అయ్యి స్మిత్‌ బ్యాట్‌, ప్యాడ్‌ మధ్య నుంచి స్టంప్స్‌ను గిరాటేసింది.

దీంతో స్మిత్‌ ఒక్క సారిగా షాక్‌కు గురయ్యాడు. కాసేపు క్రీజులోనే అలా ఉండిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ సోషల్‌మీడియాలో షేర్‌ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.

177 పరుగులకే కుప్పకూలిన ఆసీస్‌
ఇక భారత స్పిన్నర్లు చెలరేగడంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 177 పరుగులకే ఆలౌటైంది. ఆసీస్‌ బ్యాటర్లలో మార్నస్‌ లబుషేన్‌ 49 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. స్టీవ్‌ స్మిత్‌ 37, అలెక్స్‌ కేరీ 36 పరుగులు చేశారు. టీమిండియా బౌలర్లలో జడేజా ఐదు వికెట్లతో కంగరూల పతనాన్ని శాసించగా.. అశ్విన్‌ మూడు వికెట్లతో రాణించాడు. సిరాజ్‌, షమీ చెరొక వికెట్‌ తీశారు. 
చదవండి: Ravindra Jadeja: పాంచ్‌ పటాకా.. ఆటతో పాటు తీరు కూడా కొత్తగా

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)