ఇదేమి అంపైరింగ్‌.. కళ్లు కన్పించడం లేదా? వీడియో వైరల్‌

Published on Fri, 12/15/2023 - 09:38

జోహన్నెస్‌బర్గ్‌ వేదికగా దక్షిణాఫ్రికా-భారత్‌ మద్య జరిగిన మూడో టీ20లో అంపైర్‌ అల్లావుదీన్ పాలేకర్ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమైంది. దక్షిణాఫ్రికా బ్యాటర్‌ డేవిడ్‌ మిల్లర్‌ క్లియర్‌గా ఔటైనప్పటికి అంపైర్‌ నాటౌట్‌గా ప్రకటించడం అందరని షాక్‌కు గురిచేసింది.

ఏమి జరిగిందంటే?
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌ 9 ఓవర్‌లో నాలుగో బంతిని ఔట్‌ సైడ్‌ ఆఫ్‌ స్టంప్‌ దిశగా వేశాడు. ఈ క్రమంలో మిల్లర్‌ కట్‌ షాట్‌ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే బంతి బ్యాట్‌ ఎడ్జ్‌ తీసుకుని నేరుగా వికెట్‌ కీపర్‌ జితేష్‌ శర్మ చేతికి వెళ్లింది. వెంటనే కీపర్‌తో పాటు బౌలర్‌ జడేజా గట్టిగా అప్పీల్‌ చేశారు. అయితే ఫీల్డ్‌ అంపైర్‌ అల్లావుదీన్ మాత్రం నాటౌట్‌ అంటూ తల ఊపాడు.

అంపైర్‌ నిర్ణయం పట్ల జడ్డూతో పాటు కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ ఆసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ తర్వాత రిప్లేలో సృష్టంగా బంతి బ్యాట్‌కు తాకినట్లు కన్పించింది. అయితే జడేజా వేసిన ఓవర్‌లో సాంకేతిక లోపం వల్ల డీఆర్‌ఎస్‌ అందుబాటులో లేదు.

దీంతో ఔటయ్యే ప్రమాదం నుంచి మిల్లర్‌ తప్పించుకున్నాడు. ఒక వేళ్ల డీఆర్‌ఎస్‌ అందుబాటులో ఉండి ఉంటే మిల్లర్‌ పెవిలియన్‌కు వెళ్లక తప్పేది కాదు. యాదృచ్ఛికంగా జడ్డు వేసిన ఓవర్‌ తర్వాత డీఆర్‌ఎస్‌ అందుబాటులో రావడం గమనార్హం. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు అంపైర్‌ను దారుణంగా ట్రోల్‌ చేస్తున్నారు. ఇదేమి అంపైరింగ్‌రా బాబు.. కళ్లు కన్పించడం లేదా అంటూ కామెంట్లు చేస్తున్నారు.
చదవండి: ENG vs WI: ఇంగ్లండ్‌కు ఏమైంది..? విండీస్‌ చేతిలో మరో ఘోర పరభావం

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)