Breaking News

ర‌విచంద్ర‌న్‌ ఆశ్విన్ విధ్వంసం.. బెంబేలెత్తిన బౌల‌ర్లు

Published on Thu, 07/03/2025 - 11:24

త‌మిళ‌నాడు ప్రీమియ‌ర్ లీగ్‌-2025లో దిండిగల్ డ్రాగన్స్ జ‌ట్టు క్వాలిఫ‌య‌ర్‌-2కు ఆర్హ‌త సాధించింది. బుధ‌వారం ఎన్‌పీఆర్ కాలేజీ గ్రౌండ్ వేదిక‌గా జరిగిన ఎలిమినేటర్‌లో ట్రిచీ గ్రాండ్ చోళస్‌పై 6 వికెట్ల తేడాతో దిండిగల్ ఘన విజయం సాధించింది. దీంతో శుక్రవారం జరగనున్న క్వాలిఫయర్‌-2లో చెపాక్ సూపర్ గిల్లీస్‌తో దిండిగల్ డ్రాగన్స్ అమీతుమీ తెల్చుకోనుంది.

కాగా ఎలిమేనటర్‌లో టీమిండియా స్పిన్ లెజెండ్‌, దిండిగల్ కెప్టెన్ రవిచంద్రన్ ఆశ్విన్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టాడు. తొలుత బౌలింగ్‌లో మూడు వికెట్లు పడగొట్టి ప్రత్యర్ధి పతనాన్ని శాసించిన ఆశ్విన్‌.. ఆ తర్వాత బ్యాటింగ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 141 పరుగుల లక్ష్య చేధనలో ప్రత్యర్ధి బౌలర్లను ఆశూ ఉతికారేశాడు.

కేవలం 48 బంతుల్లోనే 11 ఫోర్లు, మూడు భారీ సిక్సర్లతో 83 పరుగులు చేశాడు. ఆశ్విన్‌తో పాటు బాబా ఇంద్రజిత్‌(27) ఆజేయంగా నిలిచి మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. ట్రిచీ బౌలర్లలో ఈశ్వరన్ రెండు వికెట్లు పడగొట్టగా.. శర్వన్ కుమార్‌, డేవిడ్‌సన్ తలా వికెట్ సాధించారు.

అంతకుముందు బ్యాటింగ్ చేసిన ట్రిచీ గ్రాండ్ చోళస్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 140 పరుగులు చేసింది. ట్రిచీ బ్యాటర్లలో జాఫర్ జమాల్‌(33), వసీం అహ్మద్‌(36) రాణించారు. డ్రాగన్స్ బౌలర్లలో ఆశ్విన్‌తో పాటు జి పెరియస్వామి, వరుణ్ చక్రవర్తి తలా రెండు వికెట్లు సాధించారు.
చదవండి: గిల్‌.. నిన్ను చూసి గ్రేమ్ స్మిత్ గ‌ర్వ‌ప‌డుతుంటాడు: యువరాజ్‌
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)