Breaking News

చరిత్ర సృష్టించిన అశ్విన్‌.. ప్రపంచంలోనే తొలి స్పిన్నర్‌గా!

Published on Sat, 07/15/2023 - 14:15

వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా వెటరన్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ తన స్పిన్‌ మయాజాలాన్ని ప్రదర్శించాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ విండీస్‌ బ్యాటర్లకు అశ్విన్‌ చుక్కలు చూపించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసిన రవిచంద్రన్ అశ్విన్, రెండో ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు పడగొట్టాడు. ఓవరాల్‌గా రెండు ఇన్నింగ్స్‌లు అశూ 12 వికెట్లు పడగొట్టాడు. తద్వారా పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.

►అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన రెండో భారత బౌలర్‌గా అశ్విన్‌ నిలిచాడు. ఇప్పటివరకు 271 మ్యాచ్‌లు అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన అశ్విన్‌.. 709 వికెట్లు పడగొట్టాడు.  ఈ క్రమంలో భారత దిగ్గజ స్పిన్నర్‌ హర్బజన్‌ సింగ్‌(707)ను అశ్విన్‌ అధిగమించాడు. అశ్విన్‌ కెరీర్‌లో 27 ఫోర్‌ వికెట్‌, 34 ఫైవ్‌ వికెట్‌, ఎనిమిది 10 వికెట్ల హాల్స్‌ ఉన్నాయి. ఈ జాబితాలో అనిల్ కుంబ్లే 953 వికెట్లతో టాప్‌లో ఉన్నాడు.

► వెస్టిండీస్‌పై ఒకే టెస్టులో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా అశ్విన్‌ నిలిచాడు. అదే విధంగా విండీస్‌పై  ఒకే టెస్టులో అత్యుత్తమ గణంకాలు నమోదు చేసిన తొలి స్పిన్నర్‌గా అశ్విన్‌ ప్రపంచ రికార్డు సృష్టిం‍చాడు. ఇంతకుముందు ఈ రికార్డు పాకిస్తాన్‌ మాజీ స్పిన్నర్‌ సయిద్ అజ్మల్ పేరిట ఉండేది. 2011లో జరిగిన ఓ టెస్టులో అజ్మల్ 11 వికెట్లు సాధించాడు. తాజా మ్యాచ్‌తో అజ్మల్‌ రికార్డును అశ్విన్‌ బ్రేక్‌ చేశాడు. 

►విజయం సాధించిన సందర్భాల్లో అత్యధిక ఫైవ్‌ వికెట్ల హాల్స్‌ నమోదు చేసిన దివంగత ఆసీస్‌ స్పిన్నర్‌ షేర్‌ వార్న్‌ రికార్డును అశ్విన్‌ సమం చేశాడు. వీరిద్దరూ 28 సార్లు ఫైవ్‌ వికెట్ల హాల్స్‌ సాధించారు.

►టెస్టుల్లో అత్యధిక సార్లు ఐదు వికెట్ల ఘనత సాధించిన ఐదో బౌలర్‌గా అశ్విన్(34 సార్లు) నిలిచాడు . శ్రీలంక తరుపున 34 సార్లు ఫైవ్‌ వికెట్ల హాల్‌ సాధించిన రంగనా హేరాత్ రికార్డును సమం చేసిన అశ్విన్.. అనిల్ కుంబ్లే (35 సార్లు) తర్వాతి స్థానంలో నిలిచాడు.
చదవండి: Rohit Sharma Serious On Ishan Kishan: సింగిల్‌ తీయడానికి 20 బంతులు.. కిషన్‌పై రోహిత్‌ సీరియస్‌! వీడియో వైరల్‌

Videos

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)