అశ్విన్‌కు ఘోర అవ‌మానం.. అస్సలు ఊహించి ఉండడు

Published on Wed, 10/01/2025 - 20:04

ఇంట‌ర్న‌నేష‌నల్ టీ20 లీగ్‌-2026 వేలంలో టీమిండియా లెజెండ‌రీ స్పిన్న‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్‌కు ఘోర అవ‌మానం ఎదురైంది. రూ. 1.06 కోట్ల క‌నీస‌ ధ‌ర‌తో తొలి రౌండ్ వేలంలోకి వ‌చ్చిన అశ్విన్‌ను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేసేందుకు ఆస‌క్తి చూప‌లేదు.

ఈ ఏడాది ఆగ‌స్టులో ఇండియన్ ప్రీమియర్ లీగ్ నుంచి రిటైర్ అయిన అశ్విన్ విదేశీ లీగ్‌లలో ఆడాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. ఈ క్ర‌మంలోనే ఐఎల్‌టీ20 వేలంలో త‌న పేరును అశూ రిజిస్ట‌ర్ చేసుకున్నాడు. కానీ ఈ సీనియ‌ర్ స్పిన్న‌ర్ తీసుకోవ‌డానికి ఏ ఫ్రాంచైజీ ముందుకు రాలేదు. 

దీంతో అశ్విన్ అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు. అశ్విన్‌కు అంత‌ర్జాతీయ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌లోనూ అద్బుత‌మైన ట్రాక్ రికార్డు ఉంది. ఐపీఎల్‌లో ఐదు ఫ్రాంచైజీల త‌ర‌పున 221 మ్యాచ్‌లు ఆడిన అశ్విన్‌.. 187 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.

2010,2012 సీజన్లలో ఛాంపియన్‌గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో అతడు భాగంగా ఉన్నాడు. మొత్తంగా ఈ తమిళనాడు స్పిన్నర్  333 టీ20 మ్యాచ్‌ల్లో 317 వికెట్లు పడగొట్టాడు. గత సీజన్‌లో అశ్విన్ సీఎస్‌కే తరపున ఆడాడు. అతడిని సీఎస్‌కే ఏకంగా రూ. 9.75 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. 

అటువంటి ప్లేయర్ ఐఎల్‌టీ20 వేలంలో అమ్ముడుపోకపోవడం అందరిని ఆశ్చర్యపరుస్తోది. అయితే భారత లెజెండరీ స్పిన్నర్ ఆస్ట్రేలియా బిగ్ బాష్ లీగ్‌లో ఆడేందుకు మార్గం సుగమమైంది. బిగ్ బాష్ లీగ్ (BBL) సీజన్ 15లో  సిడ్నీ థండర్స్ తరపున ఆడేందుకు అశ్విన్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. 

బీబీఎల్‌లో సిడ్నీ థండర్స్‌కు ప్రాతినిధ్యం వహించిన తొలి భారత మెన్స్ క్రికెటర్‌గా అశ్విన్ నిలవనున్నాడు. కాగా అశ్విన్ గతేడాది ఆస్ట్రేలియా పర్యటనలో అనూహ్యంగా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే.
చదవండి: IND vs AUS: ఆసీస్‌పై శ్రేయస్ అయ్యర్ విధ్వంసం.. 413 పరుగులు చేసిన భారత్‌

Videos

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)