Breaking News

ఆస్ట్రేలియాతో తొలి వన్డే.. అరుదైన రికార్డుకు చేరువలో అశ్విన్‌!

Published on Fri, 09/22/2023 - 11:05

మొహాలీ వేదికగా జరగనున్న తొలి వన్డేలో ఆస్ట్రేలియాతో తలపడేందుకు టీమిండియా అన్నివిధాల సిద్దమైంది. శుక్రవారం మధ్యాహ్నం 1:30లకు ఈ మ్యాచ్‌ ప్రారంభం కానుంది. కాగా ఈ సిరీస్‌ వరల్డ్‌కప్‌ సన్నాహకాల్లో భాగంగా జరగనుంది.

అయితే తొలి రెండు వన్డేలకు రెగ్యూలర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి, హార్దిక్‌ పాండ్యా, కుల్దీప్‌ యాదవ్‌కు విశ్రాంతి ఇచ్చారు. మరోవైపు గత కొంత కాలంగా జట్టుకు దూరంగా ఉంటున్న వెటరన్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌కు సెలక్టర్లు అనుహ్యంగా పిలుపునిచ్చారు.

ఈ క్రమంలో ఆస్ట్రేలియాతో తొలి వన్డేకు ముందు టీమిండియా వెటరన్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. ఈ మ్యాచ్‌లో అశ్విన్‌ మరో మూడు వికెట్లు పడగొడితే.. ఆసీస్‌పై అన్ని ఫార్మాట్‌ల్లో కలిపి అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా రికార్డులకెక్కుతాడు. ప్రస్తుతం ఈ రికార్డు భారత స్పిన్‌ దిగ్గజం అనిల్‌ కుంబ్లే(142 వికెట్లు) పేరిట ఉంది. అశ్విన్‌ 140 వికెట్లతో కుంబ్లే తర్వాతి స్ధానంలో ఉన్నాడు.

తుది జట్లు (అంచనా)..
భారత్‌: ఇషాన్‌ కిషన్‌, శుబ్‌మన్‌ గిల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, కేఎల్‌ రాహుల్‌(కెప్టెన్‌), రవీంద్ర జడేజా, వాషింగ్టన్‌ సుందర్‌, అశ్విన్‌, మహ్మద్‌  షమీ, సిరాజ్‌, బుమ్రా

ఆస్ట్రేలియా: డేవిడ్‌ వార్నర్‌, మిచెల్‌ మార్ష్‌, స్టీవ్‌ స్మిత్‌, లబుషేన్‌, అలెక్స్‌ కేరీ, గ్రీన్‌, మార్కస్‌ స్టాయినిస్‌, ప్యాట్‌ కమిన్స్‌, స్పెన్సర్‌ జాన్సన్‌, అడమ్‌ జంపా, హేజిల్‌వుడ్‌
చదవండి: ODI World Cup 2023: వరల్డ్‌కప్‌ ట్రోఫీని ఎవరు తయారు చేశారో తెలుసా.. ధర ఎంతంటే?

Videos

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)