Breaking News

టీమిండియాకు డబుల్ షాక్‌

Published on Sun, 07/12/2026 - 10:15

జింబాబ్వే పర్యటనకు ముందు భారత్‌కు భారీ షాక్ తగిలింది. స్టార్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి గాయం కారణంగా జింబాబ్వేతో టీ20 సిరీస్‌కు దూరం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్ సందర్భంగా వరుణ్ తొడ కండరాల గాయం బారిన పడ్డాడు. 

దీంతో చివరి రెండు టీ20లకు అతడు అందుబాటులో లేడు. అయితే ఈ మిస్టరీ స్పిన్నర్ గాయం కాస్త తీవ్రమైనదిగా తెలుస్తోంది. అతడు కోలుకోవడానికి దాదాపు నాలుగు వారాల సమయం పట్టనున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలోనే అతడు జింబాబ్వే టూర్ నుంచి కూడా వైదొలగుతున్నట్లు సమాచారం. 

దీంతో వరుణ్ స్ధానంలో మరో లెగ్ స్పిన్న‌ర్ ర‌వి బిష్ణోయ్‌ను సెల‌క్ట‌ర్లు ఎంపిక చేయ‌నున్న‌ట్లు బీసీసీఐ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. కాగా ఈ రాజ‌స్తాన్ స్పిన్న‌ర్ ఇంగ్లండ్ సిరీస్‌లో తీవ్ర నిరాశ‌ప‌రిచాడు. రెండు మ్యాచ్‌లు ఆడిన బిష్ణోయ్ ఒక్క వికెట్ కూడా ప‌డ‌గొట్ట‌లేదు.

తొలి టీ20 వ‌ర్షం కార‌ణంగా ర‌ద్దు కాగా.. రెండో టీ20లో మాత్రం భారీగా ప‌రుగులు స‌మ‌ర్పించుకున్నాడు. దీంతో అత‌డిని తుది జ‌ట్టు నుంచి త‌ప్పించారు. కానీ ఇప్పుడు వ‌రుణ్ గాయప‌డ‌డంతో బిష్ణోయ్‌కు మ‌రో అవ‌కాశం ల‌భించింది. మ‌రోవైపు పేస్ బౌలింగ్ ఆల్‌రౌండ‌ర్ హ‌ర్షిత్ రాణా గాయం కార‌ణంగా ఇంగ్లండ్‌తో వ‌న్డే సిరీస్‌కు దూర‌మ‌య్యాడు. 

అత‌డి స్ధానంలో అర్ష‌ద్ ఖాన్ లేదా గుర్నూర్ బ్రార్‌ను జ‌ట్టులోకి తీసుకునే అవ‌కాశ‌ముంది. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ జూలై 14 నుంచి ప్రారంభం కానుంది. ఆ త‌ర్వాత  జూలై 23 నుంచి జింబ్వాబేతో మూడు టీ20ల సిరీస్‌లో భార‌త్ త‌ల‌ప‌డ‌నుంది. కాగా ఐర్లాండ్‌, ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లను భారత్ కోల్పోయిన సంగతి తెలిసిందే.

Videos

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)