Breaking News

చరిత్ర సృష్టించిన అశ్విన్‌.. అనిల్‌ కుంబ్లే రికార్డు బద్దలు

Published on Mon, 07/24/2023 - 08:14

ట్రినిడాడ్‌ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా పట్టు బిగుస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో దక్కిన 183 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ బ్యాటింగ్ మొదలెట్టిన టీమిండియా.. 24 ఓవర్లలోనే 2 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో రోహిత్‌ శర్మ(44 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 57), కిషన్‌(34 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 52) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడారు.

దీంతో 181/2 పరుగుల వద్ద తమ రెండో ఇన్నింగ్స్‌ను భారత్‌ డిక్లేర్‌ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో దక్కిన ఆధిక్యంతో కలిపి వెస్టిండీస్ ముందు 365 పరుగుల భారీ లక్ష్యం నిలిపింది. 365 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్‌ నాలుగో రోజు ఆటముగిసే సమయానికి రెండు వికెట్లు కోల్పోయి 76 పరుగులు చేసింది. క్రీజులో చంద్రపాల్‌(24), బ్లాక్‌వుడ్‌(20) పరుగులతో ఉన్నారు. భారత్‌ విజయానికి మరో 8 వికెట్లు అవసరమమవ్వగా.. వెస్టిండీస్‌కు ఇంకా 289 పరుగులు కావాలి. 

అశ్విన్‌ అరుదైన రికార్డు..
ఇక విండీస్‌ సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు పడగొట్టిన భారత స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ అరుదైన ఘనత సాధించాడు. టెస్టుల్లో వెస్టిండీస్‌పై అత్యధిక వికెట్లు పడగొట్టిన రెండో భారత బౌలర్‌గా అశ్విన్‌ రికార్డులకెక్కాడు. అశ్విన్‌ ఇప్పటివరకు విండీస్‌పై 75 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో అనిల్‌ కుంబ్లే(74)ను అశ్విన్‌ అధిగమించాడు. ఈ అరుదైన ఫీట్‌ సాధించిన జాబితాలో కపిల్‌ దేవ్‌(89) ఉన్నారు.
చదవండి: IND vs WI: రోహిత్‌, కిషన్‌ మెరుపు ఇన్నింగ్స్‌.. విజయానికి 8 వికెట్ల దూరంలో టీమిండియా

Videos

పులివెందులలో ఉద్రిక్తత.. అవినాష్ రెడ్డి సహా వందల మందిపై కేసులు

ప్రతి కార్యకర్త తిరగబడండి.. నిలబడండి.. YSRCP శ్రేణులకు జగన్ పిలుపు

కోలీవుడ్ డైరెక్టర్స్ వైపే చూస్తున్న టాలీవుడ్ టాప్ హీరోస్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

ఆళ్లగడ్డలో ఉద్రిక్తత.. ఇద్దరు ప్రపోజర్లు కిడ్నాప్

దీపావళి తర్వాత మూతపడనున్న పెట్రోల్ బంకులు? కారణం ఇదుకే..!

ప్రొద్దుటూరులో హై టెన్షన్.. రాచమల్లు, YSRCP నేతలపై లాఠీ ఛార్జ్

గుత్తిలో కౌన్సిలర్ల నామినేషన్లకు అడ్డంకులు.. శివంగిలా ఎదురెళ్లి ఇచ్చిపడేసిన నైరుతి రెడ్డి

150 కుటుంబాలు TDPకి బై బై.. విజయనగరంలో బాబుకు బిగ్ షాక్

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)