Breaking News

వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌ సౌతాఫ్రికాకు కొత్త కెప్టెన్‌

Published on Thu, 06/26/2025 - 15:03

ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్ సౌతాఫ్రికాకు కొత్త కెప్టెన్‌ వచ్చాడు. టీ20 ఫార్మాట్‌లో ఆ జట్టుకు రస్సీ వాన్‌ డెర్‌ డస్సెన్‌ సారధిగా నియమితుడయ్యాడు. జులైలో జింబాబ్వేలో జరుగనున్న పొట్టి ఫార్మాట్‌ సిరీస్‌ కోసం క్రికెట్‌ సౌతాఫ్రికా డస్సెన్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసింది. ఈ ట్రై సిరీస్‌లో జింబాబ్వే, సౌతాఫ్రికాతో పాటు న్యూజిలాండ్‌ పాల్గొననుంది. రెగ్యులర్‌ టీ20 కెప్టెన్‌ ఎయిడెన్‌ మార్క్రమ్‌ సహా సీనియర్లకు విశ్రాంతినివ్వడంతో డస్సెన్‌కు సారథ్య బాధ్యతలు అప్పజెప్పారు. ఈ ట్రై సిరీస్‌ కోసం ఎంపిక చేసిన జట్టులో చాలా కొత్త ముఖాలు ఉన్నాయి.

ఈ ఏడాది సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో టాప్‌ స్కోరర్‌గా నిలిచిన విధ్వంసకర ఓపెనర్‌ లూహాన్‌ డ్రి ప్రిటోరియస్‌ తొలిసారి జాతీయ టీ20 జట్టు నుంచి పిలుపునందుకున్నాడు. ఇదివరకే వన్డే, టెస్ట్‌ల్లో అరంగేట్రం చేసిన  కార్బిన్‌ బాష్‌ కూడా తొలిసారి టీ20 బెర్త్‌ దక్కించుకున్నాడు. సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో సత్తా చాటిన రూబిన్‌ హెర్మన్‌.. ఇదివరకే మిగతా రెండు ఫార్మాట్లలో జాతీయ జట్టుకు ఆడిన సెనురన్‌ ముత్తుస్వామి మిగతా అన్‌క్యాప్డ్‌ ప్లేయర్లుగా ఎంపికయ్యారు.

గాయాల కారణంగా గత కొంతకాలంగా ఆటకు దూరంగా ఉన్న పేసర్లు నండ్రే బర్గర్‌, గెరాల్డ్‌ కొయెట్జీ ఈ ట్రై సిరీస్‌తో రీఎంట్రీ ఇవ్వనున్నారు. గత రెండేళ్లుగా జట్టుకు దూరంగా ఉన్న బ్యాటింగ్‌ సంచనలం డెవాల్డ్‌ బ్రెవిస్‌ కూడా ఈ సిరీస్‌ కోసం పిలుపునందుకున్నాడు. షుక్రీ కన్రాడ్‌ సౌతాఫ్రికా ఆల్‌ ఫార్మాట్‌ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇదే అతనికి తొలి టీ20 అసైన్‌మెంట్‌. 

జింబాబ్వేలోని హరారే వేదికగా జరిగే ఈ ట్రై సిరీస్‌ జులై 14 నుంచి ప్రారంభమవుతుంది. జులై 26న జరిగే ఫైనల్‌తో ఈ టోర్నీ ముగుస్తుంది. కాగా, టెంబా బవుమా నేతృత్వంలోని సౌతాఫ్రికా ఇటీవలే వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌గా అవతరించిన విషయం తెలిసిందే. లార్డ్స్‌లో జరిగిన ఫైనల్లో ఈ జట్టు ఆస్ట్రేలియాను చిత్తు చేసి చాలాకాలం తర్వాత ఐసీసీ టోర్నీ గెలిచింది.

జింబాబ్వేలో జరిగే ట్రై సిరీస్‌ కోసం సౌతాఫ్రికా జట్టు..
రస్సీ వాన్ డెర్ డస్సెన్ (కెప్టెన్‌), కార్బిన్ బాష్, డెవాల్డ్ బ్రెవిస్, నండ్రే బర్గర్, గెరాల్డ్ కోయెట్జీ, రీజా హెండ్రిక్స్, రూబిన్ హెర్మన్, జార్జ్ లిండే, క్వేనా మఫాకా, సెనురన్ ముత్తుస్వామి, లుంగి ఎంగిడి, న్కాబా పీటర్, లుహాన్-డ్రి ప్రిటోరియస్‌, ఆండైల్‌ సైమ్‌లేన్‌

జింబాబ్వే ట్రై సిరీస్‌ షెడ్యూల్‌..
జులై 14- జింబాబ్వే వర్సెస్‌ సౌతాఫ్రికా
జులై 16- సౌతాఫ్రికా వర్సెస్‌ న్యూజిలాండ్‌
జులై 18- జింబాబ్వే వర్సెస్‌ న్యూజిలాండ్‌
జులై 20- జింబాబ్వే వర్సెస్‌ సౌతాఫ్రికా
జులై 22- న్యూజిలాండ్‌ వర్సెస్‌ సౌతాఫ్రికా
జులై 24- జింబాబ్వే వర్సెస్‌ న్యూజిలాండ్‌
జులై 26- ఫైనల్‌

  • అన్ని మ్యాచ్‌లు హరారే స్పోర్ట్స్‌ క్లబ్‌లో జరుగుతాయి. భారతకాలమానం ప్రకారం మ్యాచ్‌లన్నీ సాయంత్రం 4:30 గంటలకు ప్రారంభమవుతాయి. 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)