Breaking News

'ఇదొక క్రూరమైన చర్య'.. అఫ్గాన్ క్రికెటర్ల మృతిపై రషీద్ ఖాన్ దిగ్భ్రాంతి

Published on Sat, 10/18/2025 - 09:09

పాకిస్తాన్ మ‌రోసారి త‌న వ‌క్ర‌బుద్దిని చాటుకుంది. అఫ్గానిస్తాన్‌లోని పక్తికా ప్రావిన్స్‌లో శుక్రవారం సాయంత్రం పాకిస్తాన్ వైమానిక దాడులు జరిపింది. ఈ దాడిలో మొత్తం 8 మంది మృతి చెందారు. అందులో ముగ్గురు స్థానిక క్రికెటర్లు కూడా ఉన్నారు.

ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడేందుకు షరానా పట్టణానికి వెళ్లి.. తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో పాక్ దుశ్చర్యకు పాల్పడింది. ఈ విషాదకర సంఘటనపై అఫ్గానిస్తాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ స్పందించాడు. పాకిస్తాన్‌పై రషీద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ ఘటనను అత్యంత క్రూరమైన చర్యగా అతడు పేర్కొన్నాడు.

"పాకిస్తాన్ జరిపిన దాడిలో పౌరులు, దేశానికి ప్రాతినిధ్యం వహించాలని కలలు కన్న యువ క్రికెటర్లు ప్రాణాలు కోల్పోవడం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. సాధారణ ప్రజులు నివసించే ప్రాంతాలను టార్గెట్ చేసి దాడి చేయడం ఒక ‍క్రూరమైన చర్య. ఇటువంటి చట్టవిరుద్ధమైన చర్యలు మానవ హక్కుల తీవ్ర ఉల్లంఘనను సూచిస్తాయి. 

పాకిస్తాన్‌తో జరగబోయే మక్కోణపు సిరీస్ నుంచి వైదొలగాలనే ఏసీబీ నిర్ణయాన్ని నేను స్వాగతిస్తున్నాను. ఈ క్లిష్ట సమయంలో ప్రజలకు అండగా నిలవాలనుకుంటున్నాను. దేశమే అన్నింటికంటే ముందు అని రషీద్ ఎక్స్‌లో రాసుకొచ్చాడు. అదేవిధంగా మహ్మద్ నబీ, రెహ్మతుల్లా గుర్భాజ్ వంటి స్టార్ క్రికెటర్లు కూడా తమ సంతాపం తెలియజేశారు.
చదవండి: పాకిస్తాన్ దాడి.. ముగ్గురు అఫ్గాన్ క్రికెట‌ర్ల మృతి

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)