Breaking News

T20 WC: రషీద్‌ ఖాన్‌పై వేటు.. అఫ్గనిస్తాన్‌కు కొత్త కెప్టెన్‌

Published on Thu, 03/05/2026 - 17:30

అఫ్గనిస్తాన్‌ మేటి స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌పై వేటు పడింది. టీ20 కెప్టెన్సీ నుంచి అఫ్గన్‌ క్రికెట్‌ బోర్డు (ACB) అతడిని తొలగించింది. రషీద్‌ ఖాన్‌ స్థానంలో ఓపెనింగ్‌ బ్యాటర్‌ ఇబ్రహీం జద్రాన్‌ను కొత్త కెప్టెన్‌గా నియమించింది. ఇందుకు సంబంధించి ఏసీబీ గురువారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.

శ్రీలంకతో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌ నుంచి ఇబ్రహీం జద్రాన్‌ అఫ్గన్ టీ20 జట్టు సారథిగా (T20I New Captain) వ్యవహరిస్తాడని తెలిపింది. ఈ సందర్భంగా రషీద్‌ ఖాన్‌ (Rashid Khan) కెప్టెన్సీలో జట్టు సాధించిన చిరస్మరణీయ విజయాన్ని ఏసీబీ ప్రస్తావించింది.

గుర్తుండిపోయే విజయాలు
‘‘అఫ్గనిస్తాన్‌ టీ20 జట్టు కెప్టెన్‌గా రషీద్‌ ఖాన్‌ పదవీ కాలంలో జట్టు గుర్తుండిపోయే విజయాలు సాధించింది. ముఖ్యంగా 2024 టీ20 ప్రపంచకప్‌ టోర్నీలో ఏకంగా సెమీ ఫైనల్‌కు చేరుకుంది. అయితే, ఏసీబీ దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని యాజమాన్యంలో మార్పులు తీసుకువచ్చింది.

కొత్త హెడ్‌కోచ్‌ వచ్చారు. అదే విధంగా కెప్టెన్‌ను కూడా మార్చాలని నిర్ణయించుకున్నాం. రషీద్‌ ఖాన్‌ డిప్యూటీగా పనిచేసిన ఇబ్రహీం జద్రాన్‌కు పగ్గాలు అప్పగించాము. 

రషీద్‌ ఖాన్‌ సేవలను మేము ప్రశంసిస్తున్నాం. అలాగే ఇబ్రహీం జద్రాన్‌ తన కొత్త,అతి ముఖ్యమైన పాత్రలో రాణించాలని కోరుకుంటున్నాం’’ అంటూ అఫ్గనిస్తాన్‌ చీఫ్‌ సెలక్టర్‌ అహ్మద్‌ షా సలీమనిఖిల్‌ ప్రకటన విడుదల చేశాడు.

కాగా మార్చి 13, 15, 17 తేదీల్లో అఫ్గనిస్తాన్‌- శ్రీలంక మధ్య షార్జాలో మూడు టీ20లు, దుబాయ్‌లో మార్చి 20, 22, 25 మూడు వన్డేలకు షెడ్యూల్‌ ఖరారైంది. ఇందుకు సంబంధించి జట్లను ఏసీబీ తాజాగా ప్రకటించింది.

టీ20 ప్రపంచకప్‌-2026లో అఫ్గనిస్తాన్‌ వైఫల్యం
గత ఎడిషన్‌ ప్రభావంతో ఓ మోస్తరు అంచనాలతో బరిలోకి దిగిన అఫ్గనిస్తాన్‌ ఈసారి నిరాశపరిచింది. గ్రూప్‌-డి నుంచి సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌, యూఏఈ, కెనడా జట్లతో పోటీపడిన అఫ్గన్‌ జట్టు.. నాలుగింట కేవలం రెండు విజయాలే సాధించింది. ఫలితంగా సూపర్‌-8కు చేరకుండానే నిష్క్రమించింది.

ఈ క్రమంలో జొనాథన్‌ ట్రాట్‌ హెడ్‌కోచ్‌గా తప్పుకోగా..  స్థానంలో కొత్త హెడ్‌ కోచ్‌గా రిచర్డ్‌ పైబస్‌ను నియమించింది ఏసీబీ. శ్రీలంకతో సిరీస్‌ సందర్భంగా కోచ్‌గా అతడు బాధ్యతలు చేపట్టనున్నాడు.‌

శ్రీలంకతో టీ20 సిరీస్‌కు అఫ్గన్‌ జట్టు
ఇబ్రహీం జద్రాన్ (కెప్టెన్‌), రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్‌ కీపర్‌), నూర్ రెహమాన్ (వికెట్‌ కీపర్‌), సెదిఖుల్లా అటల్, దర్విష్ రసూలీ, షాహిదుల్లా కమల్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, షరాఫుద్దీన్ అష్రఫ్, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ముజీబ్ ఉర్ రహ్మాన్, జియా ఉర్‌ రహ్మాన్‌ షరీఫీ, ఫరీద్‌ అహ్మద్‌, అబ్దుల్లా అహ్మద్‌జాయ్‌

శ్రీలంకతో వన్డే సిరీస్‌కు అఫ్గన్‌ జట్టు
హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్‌), రహ్మత్ షా (వైస్‌ కెప్టెన్‌), రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్‌ కీపర్‌), ఇక్రామ్ అలీఖిల్ (వికెట్‌ కీపర్‌), ఇబ్రహీం జద్రాన్, సెదీఖుల్లా అటల్, దర్విష్ రసూలీ, అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, నంగ్యాల్ ఖరోటీ, జియా ఉర్‌ రహ్మాన్‌ షరీఫీ, ఫరీద్‌ అహ్మద్‌, బిలాల్‌ సమీ. 

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)