Breaking News

ర‌షీద్ ఖాన్ అత్యంత చెత్త రికార్డు.. ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే

Published on Sat, 05/31/2025 - 13:26

ర‌షీద్ ఖాన్‌.. ప్ర‌పంచంలోనే అత్యుత్త‌మ స్పిన్న‌ర్ల‌లో ఒక‌డిగా పేరు గాంచాడు. త‌న స్పిన్ మ‌యాజాలంతో ప్ర‌త్య‌ర్ధుల‌ను ముప్పు తిప్ప‌లు పెట్టే  సత్తా ఉన్నోడు రషీద్. కానీ ఐపీఎల్‌-2025లో మాత్రం రషీద్ త‌న మార్క్‌ను చూపించ‌లేక‌పోయాడు. ఈ ఏడాది సీజ‌న్‌లో అఫ్గాన్ స్టార్ స్పిన్న‌ర్ దారుణంగా విఫ‌ల‌మ‌య్యాడు.

ప్ర‌తీ మ్యాచ్‌లోనూ భారీగా ప‌రుగులు స‌మ‌ర్పించుకుంటూ జ‌ట్టుకు భారంగా మారాడు. శుక్ర‌వారం ముంబై ఇండియ‌న్స్‌తో జ‌రిగిన ఎలిమినేట‌ర్‌లోనూ అదే తీరును క‌న‌బ‌రిచాడు. త‌న నాలుగు ఓవ‌ర్ల‌లో కోటాలో వికెట్ ఏమీ తీయ‌కుండా 31 ప‌రుగులు ఇచ్చాడు. ఓవ‌రాల్‌గా ఈ ఏడాది సీజ‌న్‌లో 15 మ్యాచ్‌లు ఆడిన ర‌షీద్‌.. 9.34 ఏకాన‌మితో కేవ‌లం 9 వికెట్లు మాత్రమే ప‌డ‌గొట్టాడు.

ర‌షీద్ ఖాన్ చెత్త రికార్డు..
ఈ క్ర‌మంలో ర‌షీద్ ఖాన్ అత్యంత చెత్త రికార్డును త‌న ఖాతాలో వేసుకున్నాడు. ఒక ఐపీఎల్ సీజ‌న్‌లో అత్య‌ధిక సిక్స‌ర్లు స‌మ‌ర్పించుకున్న బౌల‌ర్‌గా ర‌షీద్ ఆప్ర‌తిష్ట‌ను మూట‌క‌ట్టుకున్నాడు. ఈ ఏడాది సీజ‌న్‌లో ర‌షీద్ ఏకంగా 33 సిక్సర్లు ఇచ్చాడు. ఇప్ప‌టివ‌ర‌కు ఈ రికార్డు టీమిండియా ఫాస్ట్ బౌల‌ర్ మహ్మ‌ద్ సిరాజ్ పేరిట ఉండేది. 

2022 ఐపీఎల్ సీజ‌న్‌లో ఆర్సీబీకి ప్రాతినిథ్యం వ‌హిస్తూ సిరాజ్ 31 సిక్స‌ర్లు ఇచ్చాడు. తాజా మ్యాచ్‌లో రెండు సిక్స‌ర్లు ఇచ్చిన ర‌షీద్‌.. సిరాజ్‌ను అధిగ‌మించాడు. వీరిద్ద‌రి త‌ర్వాత స్ధానాల్లో చాహ‌ల్‌(30), హ‌స‌రంగా(30),బ్రావో ఉన్నారు. కాగా ఎలిమినేట‌ర్ మ్యాచ్‌లో 20 ప‌రుగుల తేడాతో గుజ‌రాత్ ఓట‌మి పాలైంది.
చదవండి: అదే మా కొంప‌ముంచింది.. అతడు మాత్రం నిజంగా అద్బుతం: గిల్
 

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)