Breaking News

10 మంది రిటైర్డ్‌ అవుట్‌

Published on Sun, 05/11/2025 - 03:34

బ్యాంకాక్‌: మహిళల టి20 ప్రపంచకప్‌ ఆసియా క్వాలిఫయింగ్‌ టోర్నమెంట్‌లో అరుదైన ఫీట్‌ నమోదైంది. బ్యాంకాక్‌ వేదికగా యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ), ఖతార్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో యూఏఈకి చెందిన 10 మంది ప్లేయర్లు రిటైర్డ్‌ అవుట్‌గా వెనుదిరిగారు. మహిళల, పురుషుల క్రికెట్‌లో కలిపి ఒక జట్టులో ఇద్దరికి మించి ఎక్కువ మంది ఆటగాళ్లు రిటైర్డ్‌ అవుట్‌ కావడం ఇదే తొలిసారి. మొదట బ్యాటింగ్‌కు దిగిన యూఏఈ 16 ఓవర్లలో 192 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్, కెపె్టన్‌ ఈషా ఓజా (55 బంతుల్లో 113; 14 ఫోర్లు, 5 సిక్స్‌లు), తీర్థ సతీశ్‌ (42 బంతుల్లో 74; 11 ఫోర్లు) దంచి కొట్టారు. 

ఈ ఇద్దరు తొలి వికెట్‌కు 16 ఓవర్లలోనే 192 పరుగులు జోడించారు. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో డిక్లరేషన్‌ సౌలభ్యం లేకపోవడంతో... వీరిద్దరితో పాటు మిగిలిన ప్లేయర్లంతా రిటైర్డ్‌ అవుట్‌గా ప్రకటించుకొని ప్రత్యర్థిని బ్యాటింగ్‌కు ఆహ్వానించారు. లక్ష్యఛేదనకు దిగిన ఖతార్‌  11.1 ఓవర్లలో 29 పరుగులకే ఆలౌటైంది. ఫలితంగా యూఏఈ జట్టు 163 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ఓపెనర్‌ రిజ్పా బానో ఇమ్మాన్యూయేల్‌ (20; 2 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌ కాగా... మిగిలిన వాళ్లంతా సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు. 8 మంది ప్లేయర్లు డకౌటయ్యారు. దీంతో ఇరు జట్లలో కలిపి 15 మంది ప్లేయర్లు డకౌటయ్యారు. మహిళల టి20 క్రికెట్‌లో ఇదే అత్యధికం. యూఏఈ బౌలర్లలో మిచెల్‌ బోథా 3, కేటీ థామ్సన్‌ 2 వికెట్లు పడగొట్టారు.  

Videos

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)