Breaking News

ఆర్సీబీ వదిలేసింది.. ట్రిపుల్‌ సెంచరీతో విరుచుకుపడ్డాడు..!

Published on Thu, 11/14/2024 - 15:22

రంజీ ట్రోఫీలో భాగంగా ఉత్తరాఖండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్‌ ఆటగాడు మహిపాల్‌ లోమ్రార్‌ అజేయ ట్రిపుల్‌ సెంచరీతో (360 బంతుల్లో 300; 25 ఫోర్లు, 13 సిక్సర్లు) విరుచుకుపడ్డాడు. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్‌ టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగింది. రెండో రోజు టీ విరామం సమయానికి రాజస్థాన్‌ స్కోర్‌ 660/7గా ఉంది. లోమ్రార్‌తో పాటు కుక్నా అజయ్‌ సింగ్‌ (40) క్రీజ్‌లో ఉన్నాడు. 

రాజస్థాన్‌ ఇన్నింగ్స్‌లో లోమ్రార్‌కు జతగా మరో ఆటగాడు సెంచరీ చేశాడు. కార్తీక్‌ శర్మ 115 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 113 పరుగులు చేశాడు. టెయిలెండర్లు భరత్‌ శర్మ 54, దీపక్‌ చాహర్‌ 35 పరుగులు చేయగా.. అభిజిత్‌ తోమర్‌ 20, రామ్మోహన్‌ చౌహాన్‌ 29, జుబైర్‌ అలీ ఖాన్‌ 26, దీపక్‌ హూడా 10 పరుగులు చేశాడు. ఉత్తరాఖండ్‌ బౌలర్లలో దీపక్‌ దాపోలా, స్వప్నిల్‌ సింగ్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టగా..  అంకిత్‌ మనోర్‌, అభయ్‌ నేగి, అవనీశ్‌ సుధ తలో వికెట్‌ దక్కించుకున్నారు.

ఆర్సీబీ వదిలేసింది.. ట్రిపుల్‌ సెంచరీతో విరుచుకుపడ్డాడు..!
24 ఏళ్ల మహిపాల్‌ లోమ్రార్‌ను రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఇటీవల వదిలేసింది. 2025 ఐపీఎల్‌ సీజన్‌ కోసం ఆర్సీబీ అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల జాబితాలో లోమ్రార్‌కు చోటు దక్కలేదు. ఆర్సీబీ వదిలేసిందన్న కసితో చెలరేగిపోయిన లోమ్రార్‌ ఉత్తరాఖండ్‌తో మ్యాచ్‌లో ట్రిపుల్‌ సెంచరీతో కదంతొక్కాడు. ఈ మ్యాచ్‌లో లోమ్రార్‌ మరెన్ని పరుగులు చేస్తాడో వేచి చూడాలి. 

లోమ్రార్ ఆర్సీబీ వదిలేసిన నాటి నుంచి కసితో రగిలిపోతున్నాడు. తాజా ట్రిపుల్‌ సెంచరీకి ముందు మ్యాచ్‌లో లోమ్రార్‌ సెంచరీ చేశాడు. హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను 111 పరుగులు చేశాడు. ఇదే రంజీ సీజన్‌లో హిమాచల్‌ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ లోమ్రార్‌ చెలరేగి ఆడాడు. ఆ మ్యాచ్‌లో అతను ఒక్క పరుగు తేడాతో సెంచరీ చేజార్చుకున్నాడు. లోమ్రార్‌ అరివీర భయంకర ఫామ్‌ను చూసి ఆర్సీబీ అతన్ని తిరిగి దక్కించుకునే ప్రయత్నం చేస్తుందేమో వేచి చూడాలి. లోమ్రార్‌ను ఆర్సీబీ 2022 సీజన్‌లో 95 లక్షలకు దక్కించుకుంది. లోమ్రార్‌ 2018లో ఐపీఎల్‌ అరంగేట్రం చేసి వివిధ ఫ్రాంచైజీల తరఫున ఆడాడు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)