Breaking News

IPL 2025: సీఎస్‌కే కన్నేసిన చిన్నోడు శతక్కొట్టాడు..!

Published on Thu, 11/14/2024 - 17:17

ఐపీఎల్‌ 2025 సీజన్‌ కోసం చెన్నై సూపర్‌ కింగ్స్‌ 17 ఏళ్ల ముంబై బ్యాటర్‌ ఆయుశ్‌ మాత్రేపై కన్నేసినట్లు గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుంది. సీఎస్‌కే మేనేజ్‌మెంట్‌ అతి త్వరలోనే మాత్రేను సెలెక్షన్‌ ట్రయిల్‌ రమ్మని పిలిచినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అన్నీ కుదిరితే మాత్రే వచ్చే సీజన్‌లో సీఎస్‌కే తరఫున అరంగేట్రం చేసే ఛాన్స్‌ ఉంది. మాత్రే బ్యాటింగ్‌ స్కిల్స్‌పై సీఎస్‌కే స్టార్‌ ఆటగాడు మహేంద్ర సింగ్‌ ధోని ప్రత్యేక నిఘా పెట్టినట్లు సమాచారం​. సీఎస్‌కే మేనేజ్‌మెంట్‌ వేలంలో మాత్రేను సొంతం చేసుకుని రుతురాజ్‌ గైక్వాడ్‌తో పాటు ఓపెనర్‌గా పంపాలని భావిస్తుందట.

సీఎస్‌కే దృష్టిలో పడ్డ తర్వాత మాత్రే రంజీ ట్రోఫీలో ఓ సూపర్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. సర్వీసెస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మాత్రే అద్భుతమై సెంచరీతో మెరిశాడు. ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో మాత్రే 127 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 107 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. టీమిండియా బ్యాటర్లు అజింక్య రహానే (19), శ్రేయస్‌ అయ్యర్‌ (47) తక్కువ స్కోర్లకే ఔటైన వేళ మాత్రే మెరుపు సెంచరీతో అలరించాడు. రెండో రోజు టీ విరామం సమయానికి ముంబై 4 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. మాత్రేతో పాటు ఆకాశ్‌ ఆనంద్‌ (1) క్రీజ్‌లో ఉన్నాడు. సర్వీసెస్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌కు ముంబై ఇంకా 52 పరుగులు వెనుకపడి ఉంది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన సర్వీసెస్‌ 240 పరుగులకు ఆలౌటైంది. సర్వీసెస్‌ ఇన్నింగ్స్‌లో మోహిత్‌ అహ్లావత్‌ (76), రోహిల్లా (56) అర్ద సెంచరీలతో రాణించారు. ముంబై బౌలర్లలో శార్దూల్‌ ఠాకూర్‌ నాలుగు వికెట్లు పడగొట్టగా.. మోహిత్‌ అవస్తి, షమ్స్‌ ములానీ తలో రెండు వికెట్లు, జునెద్‌ ఖాన్‌, హిమాన్షు సింగ్‌ చెరో వికెట్‌ దక్కించుకున్నారు.

ఇరానీ కప్‌తో అరంగేట్రం..
17 ఏళ్ల మాత్రే ఈ ఏడాది అక్టోబర్‌లో రెస్ట్‌ ఆఫ్‌ ఇండియాతో జరిగిన ఇరానీ కప్‌ మ్యాచ్‌లో అరంగేట్రం చేశాడు. మాత్రే ముంబై తరఫున ఇప్పటివరకు 10 ఇన్నింగ్స్‌లు ఆడి రెండు సెంచరీలు, ఓ హాఫ్‌ సెంచరీ సాయంతో 400 పైచిలుకు పరుగులు చేశాడు. 
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)