Breaking News

శతక్కొట్టిన నితీశ్‌రెడ్డి.. చెలరేగిన బౌలర్లు! ఆంధ్ర ఘన విజయం

Published on Mon, 02/05/2024 - 17:37

Andhra won by an innings and 157 runs: రంజీ ట్రోఫీ క్రికెట్‌ టోర్నీ ఎలైట్‌ డివిజన్‌లో భాగంగా బిహార్‌ జట్టుపై గ్రూప్‌ ‘బి’ మ్యాచ్‌లో ఆంధ్ర భారీ విజయం సాధించింది. ప్రత్యర్థిని ఏకంగా ఇన్నింగ్స్‌ 157 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో మూడు వికెట్లు తీయడంతో పాటు సెంచరీతో చెలరేగిన నితీశ్‌ రెడ్డి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు.

 పట్నా వేదికగా శుక్రవారం మొదలైన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆంధ్ర తొలుత బౌలింగ్‌ చేసింది. ఈ క్రమంలో బౌలర్‌ గిరినాథ్‌రెడ్డి ఏకంగా ఐదు వికెట్లతో చెలరేగి బిహార్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ పతనాన్ని శాసించాడు. ఈ నేపథ్యంలో 182 పరుగులకే బిహార్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఆలౌట్‌ అయింది.

ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఆంధ్ర జట్టు షేక్‌ రషీద్‌(91) అద్భుత అర్ధ శతకం, నితీశ్‌ రెడ్డి సూపర్‌ సెంచరీ(159; 16 ఫోర్లు, 5 సిక్స్‌లు) కారణంగా మొదటి ఇన్నింగ్స్‌లో 463 పరుగుల భారీ స్కోరు చేసింది.

ఈ నేపథ్యంలో 352 పరుగులతో వెనుకబడి రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన బిహార్‌ మూడోరోజు(ఆదివారం) ఆట ముగిసే సమయానికి 8 వికెట్లు కోల్పోయి 111 పరుగులు చేసింది. అయితే, సోమవారం నాటి ఆటలో కేవలం కేవలం పదమూడు పరుగులు మాత్రమే జతచేసి బిహార్‌ ఆలౌట్‌ అయింది.

దీంతో ఆంధ్ర ఇన్నింగ్స్‌ 157 రన్స్‌ తేడాతో గెలుపు జెండా ఎగురవేసింది. లలిత్‌ మోహన్‌కు నాలుగు, కేవీ శశికాంత్‌కు మూడు వి​కెట్లు దక్కగా.. నితీశ్‌రెడ్డి, షోయబ్‌ మహ్మద్‌ ఖాన్‌, ప్రశాంత్‌ కుమార్‌ ఒక్కో వికెట్‌ తీశారు.

చదవండి: Ind vs Eng: దెబ్బకు దెబ్బ.. ఘాటుగానే బదులిచ్చాడు! ఫొటో వైరల్‌

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)