Breaking News

శతక్కొట్టిన మయాంక్‌ అగర్వాల్‌.. రాణించిన మనీశ్‌ పాండే

Published on Tue, 10/29/2024 - 10:38

టీమిండియా ఆటగాడు, కర్ణాటక కెప్టెన్‌ మయాంక్‌ అగర్వాల్‌ రంజీ ట్రోఫీ-2024లో శతకంతో మెరిశాడు. బీహార్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మయాంక్‌ మెరుపు సెంచరీ చేశాడు. ఈ మ్యాచ్‌లో 131 బంతులు ఎదుర్కొన్న మయాంక్‌ 12 బౌండరీల సాయంతో 105 పరుగులు చేశాడు. మయాంక్‌కు జతగా మనీశ్‌ పాండే (56) కూడా రాణించడంతో కర్ణాటక తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. 

కర్ణాటక ఇన్నింగ్స్‌లో మయాంక్‌, మనీశ్‌ మినహా ఎవ్వరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. బీహార్‌ బౌలర్లలో హిమాన్షు సింగ్‌ నాలుగు వికెట్లు పడగొట్టగా.. సకీబ్‌ హుసేన్‌ రెండు, వైభవ్‌ సూర్యవంశీ ఓ వికెట్‌ దక్కించుకున్నారు. 

అంతకుముందు బీహార్‌ తొలి ఇన్నింగ్స్‌లో 143 పరుగులకు ఆలౌటైంది. షర్మన్‌ నిగ్రోద్‌ (60) అర్ద సెంచరీతో రాణించగా.. గనీ (13), బిపిన్‌ సౌరభ్‌ (31), ప్రతాప్‌ సింగ్‌ (16) రెండంకెల స్కోర్లు చేశారు. కర్ణాటక బౌలర్లలో శ్రేయస్‌ గోపాల్‌ నాలుగు వికెట్లు పడగొట్టగా.. మొహిసిన్‌ ఖాన్‌ 3, విద్యాధర్‌ పాటిల్‌, విజయ్‌కుమార్‌ వైశాఖ్‌, వి కౌశిక్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు.

144 పరుగులు వెనుకపడి సెకెండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించిన బీహార్‌ నాలుగో రోజు తొలి సెషన్‌ సమయానికి రెండు వికెట్ల నష్టానికి 27 పరుగులు చేసింది. వైభవ్‌ సూర్యవంశీ (6), షర్మన్‌ నిగ్రోద్‌ (0) ఔట్‌ కాగా.. బాబుల్‌ కుమార్‌ (11), గనీ (9) క్రీజ్‌లో ఉన్నారు. కర్ణాటక తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌కు బీహార్‌ ఇంకా 117 పరుగులు వెనుకపడి ఉంది. 
 

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)