Breaking News

Plate 1st Semi Final: తిలక్‌ వర్మ మెరుపు సెంచరీ

Published on Fri, 02/09/2024 - 17:38

Ranji Trophy 2023-24- Hyderabad vs Nagaland, Plate 1st Semi Final: టీమిండియా యువ క్రికెటర్‌ తిలక్‌ వర్మ రంజీ ట్రోఫీ-2024లో జోరు కొనసాగిస్తున్నాడు. ఇప్పటికే రెండు శతకాలు బాదిన అతడు.. తాజాగా మరో సెంచరీ చేశాడు. ప్లేట్‌ గ్రూపు తొలి సెమీ ఫైనల్లో భాగంగా నాగాలాండ్‌తో మ్యాచ్‌లో.. హైదరాబాద్‌ కెప్టెన్‌ తిలక్‌ 101 పరుగులతో సత్తా చాటాడు.

శతక్కొట్టిన తన్మయ్‌
ఉప్పల్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో శుక్రవారం మొదలైన మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన హైదరాబాద్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఈ క్రమంలో ఓపెనర్‌ తన్మయ్‌ అగర్వాల్‌ అద్భుత శతకం(164) బాదగా.. మరో ఓపెనర్‌ గహ్లోత్‌ రాహుల్‌ సింగ్‌(5) విఫలమయ్యాడు.

తిలక్‌ వర్మ మెరుపు సెంచరీ
వన్‌డౌన్‌ బ్యాటర్‌ రోహిత్‌ రాయుడు 59 పరుగులతో రాణించగా.. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌ చేసిన తిలక్‌ వర్మ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. 135 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 101 రన్స్‌ చేశాడు.

మిగతావాళ్లలో తెలుకపల్లి రవితేజ 15 పరుగులకే పెవిలియన్‌ చేరగా.. కె.నితీశ్‌ రెడ్డి, వికెట్‌ కీపర్‌ ప్రజ్ఞయ్‌ రెడ్డి క్రీజులో ఉన్నారు. తొలిరోజు ఆట ముగిసే సరికి 90 ఓవర్లలో హైదరాబాద్‌ 5 వికెట్ల నష్టానికి 383 పరుగులు చేసింది.

శుక్రవారం నాటి ఆట పూర్తయ్యే సరికి నితీశ్‌ రెడ్డి 21, ప్రజ్ఞయ్‌ రెడ్డి 12 పరుగులతో ఆడుతున్నారు. ఇక నాగాలాండ్‌ బౌలర్లలో కెప్టెన్‌ రాంగ్సెన్‌ జొనాథన్‌ రెండు, తహ్మీద్‌ రహ్మాన్‌, ఖ్రివిస్టో కెన్స్‌, ఇమ్లీవతి లెమ్య్టూర్‌ తలా ఓ వికెట్‌ దక్కించుకున్నారు. కాగా ఈ మ్యాచ్‌లో గెలిచి ఎలైట్‌ గ్రూపులో అడుగుపెట్టాలని హైదరాబాద్‌ పట్టుదలగా ఉంది.

చదవండి: Ranji Trophy: రీ ఎంట్రీలో టీమిండియా ఓపెనర్‌ ధనాధన్‌ శతకం.. ఫోర్ల వర్షం

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)