Breaking News

వరుసగా రెండో మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన రియాన్‌ పరాగ్‌

Published on Sun, 01/14/2024 - 15:44

రంజీ ట్రోఫీ 2024 ఎడిషన్‌లో అస్సాం కెప్టెన్‌ రియాన్‌ పరాగ్‌ పరుగుల వరద పారిస్తున్నాడు. సీజన్‌లో వరుసగా రెండో సెంచరీతో చెలరేగిపోయాడు. చత్తీస్‌ఘడ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో కేవల​ం 87 బంతుల్లోనే 11 ఫోర్లు, 12 సిక్సర్ల సాయంతో 155 పరుగులు చేసిన రియాన్‌.. కేరళతో జరుగుతున్న మ్యాచ్‌లో 104 బంతుల్లో బాధ్యతాయుతమైన శతకం బాదాడు. 

రియాన్‌ చేసిన ఈ రెండు శతకాలు తన జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు చేసినవే కావడం విశేషం. చత్తీస్‌ఘడ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫాలో ఆన్‌ ఆడే సమయంలో శతక్కొట్టిన రియాన్‌.. కేరళతో జరుగుతున్న మ్యాచ్‌లో తన జట్టు 25 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న దశలో సెంచరీతో ఆదుకున్నాడు. చత్తీస్‌ఘడ్‌పై రియాన్‌ చేసిన సెంచరీ రంజీ చరిత్రలో రెండో వేగవంతమైన సెంచరీ (56 బంతుల్లో) కాగా.. కేరళపై చేసిన సెంచరీ అతని కెరీర్‌లో చిరకాలం గుర్తుండిపోయేది. 

మ్యాచ్‌ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన కేరళ తొలి ఇన్నింగ్స్‌లో 419 పరుగులకు ఆలౌటైంది. సచిన్‌ బేబి సెంచరీతో (131) సత్తా చాటగా.. కున్నుమ్మల్‌ (83), కృష్ణ ప్రసాద్‌ (80), ప్రేమ్‌ (50) అర్ధసెంచరీలతో రాణించారు. అస్సాం బౌలర్లలో ముక్తర్‌ హుసేన్‌, రాహుల్‌ సింగ్‌ చెరో 3 వికెట్లు, సిద్దార్థ్‌ శర్మ 2, ఆకాశ్‌సేన్‌ గుప్తా ఓ వికెట్‌ పడగొట్టారు. 

అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన అ​స్సాం 25 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో కెప్టెన్‌ రియాన్‌ పరాగ్‌ (116) బాధ్యతాయుతమైన సెంచరీతో తన జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు.

అయితే రియాన్‌ మినహా అస్సాం ఇన్నింగ్స్‌లో ఎవరూ రాణించకపోడంతో ఆ జట్టు మరోసారి కష్టాల్లో పడింది. 212 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి కేరళ తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌కు ఇంకా 207 పరుగులు వెనుపడి ఉంది. రాహుల్‌ హజారికా (9), సిద్దార్థ్‌ శర్మ (0), సుమిత్‌ (4), గోకుల్‌ శర్మ (12), సాహిల్‌ జైన్‌ (17) తక్కువ స్కోర్లకే ఔట్‌ కాగా.. రిషవ్‌ దాస్‌ 31 పరుగులు చేశాడు.  ఆకాశ్‌సేన్‌ గుప్తా (6), ముక్తర్‌ హుస్సేన్‌ (6) క్రీజ్‌లో ఉన్నారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)