Breaking News

అది నా చేతిలో లేదు.. అందుకే అలా సెలబ్రేట్‌ చేసుకున్నా: కరుణ్‌​ నాయర్‌

Published on Sun, 03/02/2025 - 11:15

దేశ‌వాళీ క్రికెట్‌లో భార‌త వెట‌ర‌న్ బ్యాట‌ర్, విద‌ర్భ స్టార్ ఆట‌గాడు కరుణ్‌ నాయర్ త‌న సూప‌ర్ ఫామ్‌ను కొన‌సాగిస్తున్నాడు. నాగ్‌పూర్ వేదిక‌గా కేర‌ళ‌తో జ‌రుగుతున్న రంజీ ట్రోఫీ ఫైన‌ల్లో నాయర్ అద్బుతమైన సెంచ‌రీతో క‌దం తొక్కాడు. విదర్బ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 295 బంతులు ఎదుర్కొన్న కరుణ్‌​.. 10 ఫోర్లు, 2 సిక్సర్లతో 135 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇటీవల విజయ్‌ హజారే వన్డే టోర్నమెంట్‌లో 5 సెంచరీలు చేసిన కరుణ్‌ నాయర్‌కు ఓవరాల్‌గా ఈ సీజన్‌లో ఇది 9వ శతకం కావడం విశేషం.

అతడు సెంచరీ ఫలితంగా విదర్భ జట్టు భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతుంది. ఆఖరి రోజు ఆటలో విదర్బ తమ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 110.3 ఓవర్లకు 7 వికెట్లు కోల్పోయి 287 పరుగులు చేసింది. అయితే తొలి ఇన్నింగ్స్‌లో లభించిన ఆధిక్యం 37 పరుగులతో కలుపుకొని విదర్భ ఓవరాల్‌గా 324 పరుగుల ముందంజలో ఉంది.  ఇక తన సెంచరీపై నాలుగో రోజు అనంతరం కరుణ్ నాయర్ స్పందించాడు.

"మైదానంలో అడుగుపెడితే పరుగులు సాధించడమే నా పని. ప్రస్తుతం అదే చేస్తున్నా. భారత జట్టుకు తిరిగి ఎంపికవడం నా చేతిలో లేదు. దానిపై ఏం వ్యాఖ్యానించలేను. ఈ మ్యాచ్‌కు ముందు 8 శతకాలు చేశాను. జట్టు సహాయ సిబ్బందితో దీని గురించి మాట్లాడా. ఈ రోజు సెంచరీ చేస్తే తొమ్మిదో అంకే చూపుతానని చెప్పా. అది సాధ్యమైంది కాబట్టే అలా సంజ్ఞ చేశా. నేను క్రీజులో అడుగుపెట్టినప్పుడు జట్టు 7/2తో ఉంది. దీంతో సుదీర్ఘంగా బ్యాటింగ్‌ చేయాలని ముందే అనుకున్నా.

కొన్ని కఠిన సవాళ్లు ఎదురైన సెంచరీ పూర్తిచేసుకొని అజేయంగా నిలవడం ఆనందంగా ఉంది. ఆదివారం కూడా ఇదే ఏకాగ్రతతో బ్యాటింగ్‌ చేస్తాం. తొలి ఇన్నింగ్స్‌లో రనౌట్‌ కావడం ఎంతో బాధించింది. లేకపోతే అప్పుడు కూడా శతకం సాధిస్తానని అనుకున్నా. రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ చేయడం అంత సులువు కాదు. కానీ ఓపిగ్గా  ప్రయత్నించి పరుగులు రాబట్టా. నాకు ఇది నాలుగో రంజీ ట్రోఫీ ఫైనల్‌. అత్యుత్తమ ప్రదర్శన కనబర్చడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నా" అని కరుణ్ నాయర్ పేర్కొన్నాడు.
చదవండి: IML 2025: యువీ స్పిన్‌ మ్యాజిక్‌.. రాయుడు మెరుపులు! సౌతాఫ్రికాను చిత్తు చేసిన భారత్‌​

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు